నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందుతున్న బింబిసార సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం గా ఉంది.ఈ సినిమా ట్రైలర్ ను కూడా తాజాగా విడుదల చేయడం జరిగింది.
దాదాపు గా 40 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా ను రూపొందించిన విషయం తెల్సిందే.భారీ బడ్జెట్ తో రూపొందిన బింబిసార సినిమా ను ఆగస్టు లో విడుదల చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కళ్యాణ్ ఈ సినిమా లో కనిపించబోతున్నాడు అన్నట్లుగా ట్రైలర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతోంది.అయితే నందమూరి కళ్యాణ్ రామ్ కు ఉన్న మార్కెట్ నేపథ్యంలో ఈ సినిమా ను కనీసం పాతిక కోట్ల కు కూడా థియేట్రికల్ రైట్స్ ను కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదు అంటూ ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు.
కాని బింబిసార యూనిట్ సభ్యులు మాత్రం సినిమా ను భారీ మొత్తంకు అమ్మేశాం అంటు న్నారు.మార్కెట్.బిజినెస్ విషయం పక్కన పెడితే ప్రస్తుతం రిలీజ్ విషయంలో బింబిసారకు కష్టం ఎదురు కాబోతుంది.ఆగస్టు 5వ తారీకున ఈ సినిమా ను విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
బింబిసార సినిమా విడుదల అవ్వబోతున్న తేదీన కార్తికేయ 2 విడుదల కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.బింగిసార సినిమా తో పాటు ముందు తర్వాత కూడా పలు క్రేజీ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
దాంతో ఇప్పుడు ఏం జరుగుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా ఈ చారిత్రాత్మక సోషియో ఫాంటసీ సినిమా ను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయాలని కళ్యాణ్ భావిస్తున్నాడట.
అది ఎంద వరకు సాధ్యం అనేది చూడాలి.