మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ ల వ్యవహారం గురించి ఇప్పటికీ అంత చిక్కడం లేదు.వీరిద్దరూ విడివిడిగా ఉంటుండడంతో విడాకులు అయ్యాయి వేరేవేరుగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.
కానీ ఆ వార్తలపై అటు శ్రీజ కాని ఇటు కళ్యాణ్ దేవ్ గాని స్పందించలేదు.అంతేకాకుండా మెగా ఫ్యామిలీ కూడా ఈ విషయాలపై స్పందించకపోవడం ఆశ్చర్య పోవాల్సిన విషయం.
తాజాగా శ్రీజ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో పాటుగా అతని అన్ ఫాలో అవ్వడంతో ఈ విడాకుల రూమర్లకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.వీరిద్దరి వ్యవహారం మరొకసారి హాట్ టాపిక్ గా మారింది.
ఇది ఇలా ఉంటే తాజాగా శ్రీజ, కళ్యాణ్ దేవ్ ల పెద్ద కుమార్తె నివృతి పుట్టినరోజు వేడుకలను తాజాగా జూలై 5వ తేదీన నిర్వహించారు.తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా శ్రీజ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేసింది.
కానీ నివృతి బర్తడే వేడుకల్లో కళ్యాణ్ మాత్రం కనిపించలేదు.దీనితో విడాకుల వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయింది.
అంతేకాకుండా కళ్యాణ్ దేవ్ కూడా తన కూతురి బర్త్డే సందర్భంగా ఎటువంటి పోస్టులు కూడా చేయలేదు.కానీ గత ఏడాది మాత్రం తన కూతురు బర్త్డే సందర్భంగా స్పెషల్ పోస్ట్ చేయడంతో అప్పటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

కాగా తన కూతురి పుట్టినరోజు సందర్భంగా తాజాగా శ్రీజ ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.హ్యాపీ బర్త్డే ప్రిషియస్.నా జీవితంలోకి వచ్చిన వాటిలో నువ్వే ది బెస్ట్.ప్రేమ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ పోస్టులో రాసుకొచ్చింది శ్రీజ.ఆ తర్వాత నిహారిక కూడా బర్త్డే విషెస్ చెబుతూ ఈ విధంగా రాసుకొచ్చింది.హ్యాపీ బర్త్డే నివి.
ఎంతో స్వీటెస్ట్ జెన్యూన్ బేబీ వి నువ్వు.నీ నవ్వంటే నాకు ఎంతో ఇష్టం.
ఈ ప్రపంచంలోని సంతోషాన్ని అంతా కూడా పొందే అర్హత నీకు ఉంది లవ్ యూ బంగారు అంటూ నిహారిక కూడా విషెస్ తెలిపింది.అయితే ప్రతి ఒక్కరూ విషెస్ తెలిపినప్పటికీ కళ్యాణ్ దేవ్ మాత్రం కూతురికి బర్త్డే విషెస్ చెప్పకపోవడంతో మెగా అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.







