తెలంగాణలో రాజకీయ రణరంగం.నువ్వా నేనా.ఎత్తులకు పై ఎత్తులు.జాతీయ పార్టీల అధిష్టాన పర్యటనలతో హోరెత్తిపోతుంది.గత కొద్ది రోజుల క్రితమే వరంగల్ ల్లో రాహూల్ గాంధీ పర్యటన, ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపితే.తాజాగా హైదరాబాద్ లో ప్రధాని మోదీ పర్యటనతో యాకంగా బీజేపీ కార్యకర్తలు కొండెక్కి పిండికొట్టినంత పనిచేసారు.
ప్రధాని పర్యటనతో తెలంగాణలో బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.మరోవైపు ప్రస్తుత అధికార పార్టీని గద్దెదించి తెలంగాణాలో తమ జెండాను ఎగరేసి, అజెండాను అమలు చేయాలని జాతీయ పార్టీలైన అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ రెండూ ఒకదానిపై ఒకటి పావులు కదుపుతూనే ఉన్నాయి.
టీఆర్ ఎస్ లో్ అవినీతి జాడ్యం రాజ్యమేలుతుందంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.కేసీఆర్ పై దండయాత్రకు దిగితే.
, తెలంగాణాకు నిధులు వెల్లువ బీజేపీతోనే సాధ్యంమంటూ కూల్ వార్ ను ప్రధని మోదీ ప్రకటించడంపై ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చర్చనీయంశంగా మారింది.
తాజాగా టీఆర్ఎస్ కంటే బీజేపీ ఏవిధంగా బెటరో ముఖ్యంగా తెలంగాణ వాసులకు అర్ధమయ్యేలా వివరించిన మోదీ ప్రసంగాలపై ఇపుడు తర్జన భర్జనలు జరుగుతుంటే.
వరంగల్ ల్లో రాహూల్ గాంధీకేసీఆర్ పైనా, ఆపార్టీపైనా ఎక్కు పెట్టిన విమర్శనాస్త్రాలు కేవలం రెండే రెండు రోజుల్లో ప్రజలు విని మర్చిపోయారనే వాదనలు విశ్లేషకులనుంచి వ్యక్తమౌతున్నాయి.ఇక పోతే తెలంగాణాలో అధికారం ఏపార్టీని వరిస్తుంది అనే ప్రశ్నలకు భిన్న స్వారాలు వినిపిస్తుంటే, బీజేపీ మాత్రం రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఘోర ఓటమి కారణం తామే అంటూ జోస్యం చెబుతుంది.
మరో మాటగా చెప్పాలంటే గతంలో బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రసంగాల్లోని పదును ఇపుడు తగ్గిందా? లేక అధిష్టానం చేసిన సరికొత్త సూచనలు ఏమైనా ఉన్నాయా? అనే ప్రశ్నలపై పలు సందేహాలు తొంగి చూస్తున్నాయి.

మరోవైపు సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అంటూ అతికొద్దిమందికి మాత్రమే పంచిపెట్టిన, లేని సంక్షేమ పధకాలను ఆరచేతిలో స్వర్గంలా చూపిస్తున్న టీఆర్ఎస్ స్టాండ్ పై నీలినీడలు కమ్ముకుంటున్నాయనడంలో సందేహంలేదు.తాజా సమాచారం ప్రకారం పేదవాడికి డబుల్ బెడ్ రూంలు అంటూ, పెట్టిన పథకం ఇప్పటికే కొండెక్కి కూర్చుంది.అందుకు కారణం కూడా లేకపోలేదు.
డబుల్ బెడ్ రూంల ఆశావాదుల సంఖ్య మూడింతలుగా ఉంటే, ప్రభుత్వం కట్టిన ఇండ్లు మాత్రం కేవలం లక్షా 50 వేలకంటే తక్కువగా ఉన్నట్లు అధికారిక అంచనాలు.దాంతో డబుల్ బెడ్ రూంల కోసం ధరఖాస్తు చేసుకున్న వారిలో అసహనం పెరిగిపోతుందనే వాదనలు మరోవైపు బలంగా వినిపిస్తున్నాయి.
మరోవైపు డబుల్ బెడ్ రూం లు కట్టిన కాంట్రాక్టర్లకు సైతం, ఇంకా బిల్లులు చెల్లించలేదనేది తాజా సమాచారం.ఇక దళిత బంధు, రైతు బంధు, లాంటి పథకాలకు కూడా కాళ్లు లాక్కోచ్చాయంటున్నారు విశ్లేషకులు.
ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు రాష్ట్రమంతా అమలు జరుగుతుందా? అనే ప్రశ్నకు టీఆర్ ఎస్ నేతల్లో సమాధానం లేదంటున్నాయి బీజేపీ, కాంగ్రెస్ లు.ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయనే ఆందోళన అటు కాంగ్రెస్ లోనూ , ఇటు బీజేపీలోనూ ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.







