యాదాద్రి జిల్లా:తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని భువనగిరి మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షులు గంగాదేవి మహేష్ కోరారు.ఆల్ ఇండియా రేషన్ డీలర్ ఫెడరేషన్ పిలుపులో భాగంగా సోమవారం భువనగిరి తహశీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడాడుతూ రేషన్ డీలర్ల యొక్క హక్కుల కొరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల డీలర్లు ప్రభుత్వ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లకు ఇచ్చే కనీస కమిషన్ క్వింటాల్ కు రూ.440 చేయాలని డిమాండ్ చేశారు.బియ్యం,గోధుమలు పంచదారలో నష్టాన్ని పూడ్చేందుకు క్వింటాల్ కు 1 కిలో తరుగు అనుమతించాలని,ఎండిబుల్ ఆయిల్ మరియు పప్పులు చౌక ధరల దుకాణాల ద్వారా సరఫరా చేయాలని,కనీస గౌరవ వేతనం గ్రామీణ ప్రాంతాల్లో 30,000 /-పట్టణాలలో 40,000 /-కార్పొరేషన్ ప్రాంతాల్లో 50,000 /-రూపాయలు కల్పించాలని, అలాగే ఆరోగ్య భద్రత కుటుంబానికి వర్తింప చేయాలని,హమాలీ ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరించాలని కోరారు.అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మండల తహశీల్దార్ వెంకట్ రెడ్డికి సమర్పించారు.
ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలిపిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ ఇమ్రాన్,హమాలీలు బసవయ్య,కిష్టయ్య తదితరులు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలుగల రాజయ్య,జిల్లా గౌరవాధ్యక్షులు మన్నె యాదగిరి, జిల్లా కోశాధికారి ఎడ్ల ఉమాదర్శన్ రెడ్డి, ఉపాధ్యక్షులు చింతల మల్లేశం,ప్రధాన కార్యదర్శి కూరాకుల శ్రీనివాస్,కోశాధికారి నిమ్మల రమేష్, ప్రచార కార్యదర్శి నోముల ఆంజనేయులు,కార్యవర్గ సభ్యులు దికోండ కృష్ణవేణి,దోనగిరి మంజుల తదితరులు పాల్గొన్నారు.