నేడు ఎంతోమంది చిన్ననాటి స్నేహితులు ఒక్కటవుతున్నారంటే దానికో ఒక్కటే కారణం.అదే ఫేస్‌బుక్.
దీనిని మార్క్ జుకర్‌బర్గ్ ఎప్పుడు సృష్టించాడో గాని, అప్పటినుండి సోషల్ మీడియా విప్లవం స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు.అందుకే యావత్ ప్రపంచం ఇలాంటివారికి దాసోహం అంటుంది.
ఈ ప్లాట్ ఫామ్ ద్వారా ప్రజలకేకాదు, కొన్ని లక్షలమందికి జీవనోపాధి కల్పించాడు మార్క్.అయితే ఈ మధ్యకాలంలో పలురకాల కారణాల వలన మెటా తీవ్ర ఆర్ధిక సంక్షోభం ఎదుర్కొంటోంది.
ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఫైరింగ్ సందేశం పంపించారు జుకర్‌బర్గ్.
సదరు సంస్థలో ఇక పని చేయాలో లేక మానేయాలో స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించాడు.
ఈ మేరకు ఆయన మెటా ఉద్యోగులకు సందేశం పంపించారు.ఆర్థిక మందగమనం నేపథ్యంలో సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని జుకర్ బర్గ్ హెచ్చరించారు.
ఇంజినీర్ల హైరింగ్ ప్రణాళికల్లో 30% కోత విధించనున్నట్లు తెలిపారు.అలాగే ఉద్యోగంలో టార్గెట్ చేరుకోలేని వారిపై కూడా వేటు తప్పదని చెప్పారు.
సాధారణంగా ప్రతి వారం ఉద్యోగులతో నిర్వహించే ప్రశ్నలు, సమాధానాల సెషన్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇకపోతే ఎప్పుడూ లేని విధంగా ఇటీవల మెటా తీవ్ర ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కొంటోంది.2022లో ఇంజినీర్ల నియామక లక్ష్యాన్ని మెటా 6000 నుండి 7000 వరకు కుదించింది.అంతకుముందు ఈ ఏడాది 10,000 మంది కొత్త ఇంజినీర్లను హైర్ చేయాలని మెటా భావించింది.
ఇక ఆర్థిక మందగమనం నేపథ్యంలో తక్కువ మంది ఇంజినీర్లనే రిక్రూట్ చేసుకుంటామని, పరిమిత బడ్జెట్‌లతో తక్కువృద్ధి రేట్లతో మెటా ముందుకెళ్తుందని చీఫ్ ప్రోడక్ట్ ఆఫీసర్ అన్నారు.







