కెరియర్ లో బాగా సంతృప్తినిచ్చిన పాత్ర అదే: సమంత

ఏం మాయ చేసావే సినిమాతో అందరిని మాయలో పడేసిన సమంత అనంతరం వరుస సినిమా అవకాశాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు.ఇలా టాలీవుడ్ నుంచి కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్స్ కూడా అందుకుంటుంది.

 The Most Satisfying Role In Career Is That By Samantha, Samantha, Tollywood, Cin-TeluguStop.com

ఈ విధంగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరుపొందిన సమంత తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే సమంత మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

తన కెరియర్ లో ఎప్పుడు ఒకే దోరణిలో ఉన్న సినిమాలు కాకుండా కాస్త భిన్నంగా ఉన్న సినిమాలలో, పాత్రలలో నటించాలని అనుకున్నాను అందుకే ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్, పుష్ప సినిమాలోని ఉ అంటావా మామ పాటకు ఊ కొట్టానని ఈ సందర్భంగా సమంత వెల్లడించారు.రొటీన్ కి భిన్నంగా ఎలాంటి పాత్రలు చేయాలన్న ఎంతో కష్టపడాల్సి ఉంటుందని, ఇలాంటి భిన్నమైన కథలను ఎంపిక చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఆ పాత్రకు న్యాయం చేయాలని సమంత వెల్లడించారు.

Telugu Cine Career, Samantha, Telugu, Tollywood-Movie

ఇక తాను నటించిన ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ 2 విషయానికి వస్తే ఈ వెబ్ సిరీస్ లో తన పాత్ర ఎన్నో వడిదలుకులను ఎదుర్కొనే పాత్ర అయితే ఆ కష్టాన్నంతా తాను ఫీల్ అయ్యి ఈ పాత్రలో జీవించానని సమంత వెల్లడించారు.సందర్భాన్ని బట్టి ఐటం సాంగ్ లో కూడా చేయాల్సి వచ్చిందని అయితే ఈ పాటను కూడా ఎంతో చాలెంజింగ్ గా తీసుకొని చేశానని సమంత ఈ సందర్భంగా వెల్లడించారు.ఒకే తరహాలో పాత్రలు చేయడం నాకు నచ్చదు అందుకే భిన్నమైన కథలను ఎంచుకొని నటించాలని ఎదురుచూస్తున్న సమయంలో తనకు ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ అవకాశం వచ్చిందని, ఈ అవకాశం రాగానే మరో మారు ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు.నా కెరియర్ లో ఈ వెబ్ సిరీస్ లో నటించిన రాజీ పాత్ర ఎంతో సంతృప్తినిచ్చిందని ఈ సందర్భంగా సమంత వెల్లడించారు.

ఇకపోతే ప్రస్తుతం ఈమె యశోద, ఖుషి వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube