మీకు చిత్తూరు యాస వచ్చా.. పుష్ప 2లో నటించే ఛాన్స్..!

మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారా.మీకు చిత్తూరు యాస వచ్చా.

 Pushpa 2 Casting Call Sukumar Directorial , Allu Arjun, Devi Sri Prasad, Icon St-TeluguStop.com

ఇంకేంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో నటించే అవకాశం మీదే కావొచ్చు.పుష్ప 1 సృష్టించిన సంచలనాలు అందరికి తెలిసిందే.

పార్ట్ 1 ఆ రేంజ్ హిట్ అవడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు పెరిగాయి.సుకుమార్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే సినిమా షెడ్యూల్ అంతా రెడీ చేయగా త్వర్లలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఇక ఈ సినిమాలో కొత్త ముఖాలని చూపించాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్.

అందుకే సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేస్తున్నారు.దానికోసం ఒక ఆడిషన్ కాల్ కూడా ఏర్పాటు చేశారు.

ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే ఈ పుష్ప 2 ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు కాకపోతే ఖచ్చితంగా చిత్తూరు యాస వచ్చి ఉండాలి.ఆ యాసలో మాట్లాడలిగిన ఏ వయసు వారైనా ఆడిషన్స్ లో పాల్గొని సుకుమార్ ని ఇంప్రెస్ చేస్తే పుష్ప 2 లో ప్లేస్ అయినట్టే.

పుష్ప 1 ఊహించని విజయం అందుకోగా పుష్ప 2 ని అందుకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.పుష్ప పార్ట్ 1 లో కాదు పార్ట్ 2లోనే అసలు కథ ఉందని సుకుమార్ చెప్పాడు.

సో ఎలా లేదన్నా పార్ట్ 2 కూడా అంతకుమించి అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు.పుష్ప 2 విషయంలో సుకుమార్ ప్రతిదీ చాలా ఫోకస్ గా చేస్తున్నారు.

Telugu Allu Arjun, Devi Sri Prasad, Icon, Pan India, Pushpa, Sukku, Sukumar, Tol

ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న అందరు ఈ పార్ట్ 2 లో కొనసాగడమే కాకుండా పార్ట్ 2లో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని తెలుస్తుంది. పుష్ప 2 బిజినెస్ విషయంలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.ఇప్పటికే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లతో వస్తుందట.అయితే నిర్మాతలు మాత్రం ఇంకా బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube