మీకు చిత్తూరు యాస వచ్చా.. పుష్ప 2లో నటించే ఛాన్స్..!

మీరు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారా.మీకు చిత్తూరు యాస వచ్చా.

ఇంకేంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రాబోతున్న పుష్ప పార్ట్ 2 సినిమాలో నటించే అవకాశం మీదే కావొచ్చు.

పుష్ప 1 సృష్టించిన సంచలనాలు అందరికి తెలిసిందే.పార్ట్ 1 ఆ రేంజ్ హిట్ అవడంతో పార్ట్ 2 మీద భారీ అంచనాలు పెరిగాయి.

సుకుమార్ ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే సినిమా షెడ్యూల్ అంతా రెడీ చేయగా త్వర్లలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.

ఇక ఈ సినిమాలో కొత్త ముఖాలని చూపించాలని ఫిక్స్ అయ్యారు సుకుమార్.అందుకే సినిమాలో నటించేందుకు నటీనటుల ఎంపిక చేస్తున్నారు.

దానికోసం ఒక ఆడిషన్ కాల్ కూడా ఏర్పాటు చేశారు.ఏ ఏజ్ గ్రూప్ వారైనా సరే ఈ పుష్ప 2 ఆడిషన్స్ లో పాల్గొనవచ్చు కాకపోతే ఖచ్చితంగా చిత్తూరు యాస వచ్చి ఉండాలి.

ఆ యాసలో మాట్లాడలిగిన ఏ వయసు వారైనా ఆడిషన్స్ లో పాల్గొని సుకుమార్ ని ఇంప్రెస్ చేస్తే పుష్ప 2 లో ప్లేస్ అయినట్టే.

పుష్ప 1 ఊహించని విజయం అందుకోగా పుష్ప 2 ని అందుకు ఏమాత్రం తగ్గకుండా అన్ని విధాలుగా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్.

పుష్ప పార్ట్ 1 లో కాదు పార్ట్ 2లోనే అసలు కథ ఉందని సుకుమార్ చెప్పాడు.

సో ఎలా లేదన్నా పార్ట్ 2 కూడా అంతకుమించి అనిపించేలా ఉంటుందని చెప్పొచ్చు.

పుష్ప 2 విషయంలో సుకుమార్ ప్రతిదీ చాలా ఫోకస్ గా చేస్తున్నారు. """/"/ ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ లో ఉన్న అందరు ఈ పార్ట్ 2 లో కొనసాగడమే కాకుండా పార్ట్ 2లో కొన్ని కొత్త పాత్రలు కూడా యాడ్ అవుతాయని తెలుస్తుంది.

 పుష్ప 2 బిజినెస్ విషయంలో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది.ఇప్పటికే సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ వందల కోట్లతో వస్తుందట.

అయితే నిర్మాతలు మాత్రం ఇంకా బిజినెస్ డీల్స్ ఏర్పాటు చేసుకోలేదని తెలుస్తుంది.

Fatboss : Sécurité Des Joueurs Et Jeu Responsable