కోనసీమ జిల్లాలో వింత కప్పలు ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో అని ఆందోళన చెందుతున్న కోనసీమ వాసులు.కోనసీమ జిల్లా అమలాపురం మండలం బండారులంక గ్రామంలోని మట్టపర్తి వారి పాలెం లో అరుదైన పసుపురంగు కప్పలు కనిపించాయి.
గత మూడు రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపునీటిలో పసుపురంగు కప్పలు చేరాయి.ఇలాంటి కప్పలను గతంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు అంటున్నరు.
అయితే కోనసీమ ప్రాంతంలో వర్షాలు కురిసే సమయంలో ఇలాంటివి ఏమైనా వస్తే తుఫానులు కానీ వరదలు కానీ సంభవించే ముందు ప్రకృతి ఇలా హెచ్చరిస్తుంది అని ఇక్కడి ప్రజల నమ్మకం.గతంలోనూ తునిగలు గుంపులు ఆకాశంలో తెరిగితే తుఫానులు వస్తోందని ఇక్కడి ప్రజలు నమ్మకం.
అలాగే జరిగిన సందర్భాలు కుడా చాలానే ఉన్నాయి.అయితే ఇప్పుడు ఇలా ఎప్పుడు లేని విధంగా పసుపు రంగులో కప్పలు కనిపించడం కోనసీమ వాసులను ఎలాంటి విపత్తులు వస్తాయో అని బయపెడుతున్నాయి.
అయితే ఇవి సాధారణ కప్పలేనని,వీటిని బుల్ ప్రాగ్స్ అంటారన్న పశుసంవర్ధక శాఖ అధికారులు చెపుతున్నారు.ఖాకీ,ఆలివ్ కలర్లో ఉండే ఈ కప్పలు సడన్ గా ఒక్కోసారి రంగు మారతాయని ఇలా పసుపు రంగులో మారేవి మగ కప్పలేనని ఈమగ కప్పలు బ్రీడింగ్ సీజన్లో ఆడకప్పలను ఆకర్షించడానికి తమ రంగును మార్చుకుంటాయని సీజన్ ముగిసాక అవి మామూలు రంగులోకి వస్తాయని పశుసంవర్ధక శాఖ అధికారులు అంటున్నారు.







