ఈ జగత్తులో ఎన్నో వింతలు, మరెన్నో విశేషాలు.అన్ని మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
అందులో కొన్ని సైన్స్ కు అందితే.మరికొన్ని మాత్రం ఏ తర్కానికి లొంగదు.
ఏళ్లకు ఏళ్లు వాటిపై పరిశోధనలు చేసినా వాటి మూలం ఏమిటో అర్థం కాదు.ఎందుకు.
ఏమిటి.ఎలా.అనే ప్రశ్నలకు సమాధానం లభించదు.కొందరు పరిశోధకులు తమ జీవితాంతం అలాంటి కొన్ని మిస్టరీలను చేధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.
కానీ వాట ఆది దొరకదు.అంతు చిక్కదు.
అచ్చంగా అలాంటిదే ఒక మిస్టరీ గుజరాత్ లోని వెలుగు చూసింది.ఇది ఈనాటి ఆనాటిది కాదు.
ఏళ్లు గడుస్తున్నాయి దీని గురించి తెలిసి.కానీ, దాని గురించి పూర్తి వివరాలు మాత్రం ఇంకా ఎవరికీ తెలియదు.
గుజరాత్ జునాగఢ్ జిల్లాలోని జగతియా అనే గ్రామంలో భూమిలో నుంచి అగ్ని జ్వాలలు ఎగిసిపడుతున్నాయి.భూగర్భంలో నుంచి గ్యాస్ పైప్ లైన్ వేశారా అని అనుకునేలా నిరంతరం మంటలు రగులుతూనే ఉంటాయి.
మాతా హర్ సిద్ధి మందిరంలో ఈ అఖండ జ్యోతి ఉండటం వల్ల వీటిని ప్రజలు భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు.పరిశోధనల్లో ఏ విషయం తేలకపోవడం వల్ల… మంటల చుట్టూ ఆధ్యాత్మికత అల్లుకుంది.
ఆలయంలో మొత్తం మూడూ అఖండ జ్యోతులు ఉన్నాయి.2 జ్యోతులు ప్రత్యేకంగా ఓ గదిలో ఉండగా.మరొకటి గుడి ఆవరణలో ఉంటుంది.చాలా ఏళ్ల నుండి ఈ జ్యోతులు నిరంతరాయంగా వెలుగుతున్నాయని స్థానికులు అంటున్నారు.







