తుర్కపల్లిలో కల్తీ మద్యం కలకలం

సవేరా వైన్స్ లో కల్తీ మద్యం అమ్మకాలు.ఇదేంటని అడిగిన మందు బాబుకు మత్తు దిగిపోయే సమాధానం.

 Contaminated Liquor In Turkapally-TeluguStop.com

బీరు సీసా అమ్ముడు వరకే మా పని.అందులో ఏముంటే మాకేందన్న నిర్వాహకులు.లోకల్ లో మద్యం కల్తీ జరుగుతుందని ఆరోపిస్తున్న మందుబాబులు.

యాదాద్రి జిల్లా:తెలంగాణ రాష్ట్రంలో మందుబాబులు కట్టే డైలీ ట్యాక్స్ తోనే రాష్ట్రం ముందుకు పోతుంది.అలాంటి మందు బాబులకు ఎంత మర్యాద ఇవ్వాలే!కానీ,ఇగో ఇక్కడ ఓ వైన్స్ షాపులో బీర్లు అమ్మేటాయన ఒక మందుబాబుకు చిర్రెత్తుకొచ్చేలా చేశాడు.యహె నన్నే అవమానిస్తాడా రేపటి నుండి వేరే వైన్స్ దగ్గరికోయి రెండు బీర్లు అదనంగా గుంజుతా అంటూ పరేషాన్ పరేషాన్ అవుతూ వెళ్లిపొయాడు.

ఇంతకీ ఏం జరిగిందంటే?యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలోని సవేరా వైన్స్ లోకి ఓ మద్యం ప్రియుడు చల్లటి బీరు వేద్దామని పోయిండు,బీరు తీసుకుండు.గొంతు తడుపుదామని మూత ఓపెన్ చేయబోతే బీర్ బాటిల్లో మూసీనది కనిపించింది.

బాటిల్ నిండా చెత్త చెదారం,నాసు ఉండేసరికి పాపం మందుబాబు కంగుతిన్నాడు.అప్పటికే రెండు మూడు పీకుంటే దాన్ని గూడా మూడు గుట్కళ్ల లాగించేటోడే కానీ, అప్పుడే ఓపెనింగ్ కావడంతో బీర్ బాటిల్లో ఉన్న మున్సిపాలిటీ కంటపడి కన్నెర్రజేశాడు.

గిదేందయా బీర్ బాటిల్లో అంతా చెత్తా చెదారం ఉందని గట్టిగానే అడిగిండు.వైన్ షాప్ యజమాని అరెరే గట్లెట్లైంది ఇంకోటిస్తా అన్నాడని అనుకుంటున్నారా? వైన్స్ నిర్వాహకులు కూడా అబ్బే తగ్గేదేలే అన్నారు.మాకు సంబంధం లే,కంపెనీ నుంచి వచ్చినయ్,మేం అమ్ముతం అంటూ గట్టిగానే ఏసుకుండు.ఇంకేముంది మందుబాబు తీవ్ర నిరాశకు గురయ్యి,ఏం జెయ్యాలో సమాజ్ గాక తన గోడు వెళ్లబోసుకుండు.

అది కంపెనీ నుండి వచ్చింది కాదని,ఇక్కడనే మద్యం కల్తీ జేస్తుండ్రనే అనుమానం ఉందన్నారు.ఇప్పటికీ రెండు మూడుసార్లు ఇదే తంతు జరిగిందని,ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతూ దాట వేస్తున్నారని బాధను వ్యక్తం చేశాడు.

పన్నుకట్టెటోడే పనికి రాకుండా పోవడంతో మందుబాబులు మౌనంగా ఉంటారా? లేక మద్యం కల్తీపై ఉద్యమం చేస్తారా చూడాలి మరి! అయ్యా ట్యాక్స్ పేయర్లు జర్రెంత జూసుకొని లాగించండి లేదంటే పెద్ద పరేషాన్ అవుద్ది సుమీ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube