బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా చేసిన పనికి అతని మీద ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.బాలీవుడ్ లో వైవిద్యమైన పాత్రలలో నటిస్తూ హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందిన నటులలో రణదీప్ హుడా కూడా ఒకరు.
రణ్‌దీప్ ప్రధాన పాత్రలో నటించిన సరబ్ జిత్ అనే సినిమా యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది.ఉగ్రవాదం, గూఢచర్యం ఆరోపణలతో పాకిస్థాన్ లో మరణశిక్షకు గురైన సరబ్‌జిత్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది .2016 లో విడుదలైన ఈ సినిమాలో సరబ్ జిత్ పాత్రలో రణ్‌దీప్ నటించగా, అతని సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐశ్వర్యారాయ్ నటించింది.ఈ సినిమా విడుదలై మంచి విజయం సొంతం చేసుకుంది.
ఈ సినిమా షూటింగ్ సమయంలో దల్బీర్ కౌర్ తో రణ్‌దీప్ కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది.రణ్‌దీప్ హుడాలో తన సోదరుడిని చూసుకుంటున్నా అంటూ ఆమె ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చింది.
అయితే దల్బీర్ కౌర్ కి రణదీప్ హుడా తో ఉన్న అనుబంధం వల్ల తన సోదరుడి స్థానంలో తాను చనిపోయినప్పుడు ఆమెకు ‘కంధ’ (అంత్యక్రియలకు తీసుకువెళ్లేటప్పుడు భుజంపై పాడెను మోయడం) ఇవ్వాలని ఆమె రణదీప్ ని కోరింది.రణదీప్ ఇప్పుడు ఆమెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు .

దల్బీర్ కౌర్ తాజాగా పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో ఉన్న భిఖివింద్‌లో గుండెపోటుతో మృతి చెందింది.ఈ క్రమంలో రణదీప్ ఆమెకి ఇచ్చిన మాటని నిలబెట్టుకోవటానికి తన సోదరుడి స్థానంలో నిలబడి ఆమె పాడే మోసి ఆమెకు దహన సంస్కారాలు నిర్వహించాడు.ఈ విషయాన్ని రణదీప్ స్వయంగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేస్తూ చివరిసారిగా ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నాడు.నన్ను త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది.కానీ నేను వెళ్లే లోపే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయింది.ఇంత తొందరగా దల్బీర్ కౌర్ మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారని అనుకోలేదు.
ఆమె ప్రేమ, ఆశీర్వాదం నాపై ఉన్నందుకు నేను ఎంతో అదృష్టవంతుడిని.ఆమె నా చేతికి కట్టిన రాఖి నేను జీవితంలో మర్చిపోలేను అంటూ చాలా ఎమోషనల్ గా రాసుకొచ్చడు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.రణదీప్ చేసిన పనికి ప్రజలు అతని మీద ప్రశంసలు కురిపిస్తున్నారు.







