సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక డాగ్ వీడియో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.ఈ వీడియోలో కుక్క ఒక కోడిపుంజు లాగా అరుస్తూ ఆశ్చర్యపరిచింది.
దీన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.మొదటగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఆ తర్వాత ట్విట్టర్, యూట్యూబ్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా ప్రత్యక్షమైంది.
వైరల్ అవుతున్న వీడియోలో మీరు ఓ కోడి పుంజును గమనించవచ్చు.
ఈ పుంజుకి కాస్త దూరంలో ఒక తెల్ల శునకం కూర్చుని ఉండటం కూడా గమనించవచ్చు.
అయితే కోడిపుంజు ఎప్పటిలా అరిచినట్లే కుక్కురు కూ….అంటూ చెవులకు చిల్లులు పడేలా కూతపెట్టింది.
దాంతో కుక్కకి మహా చిరాకనిపించింది.ఈ కోడికి కూడా ఎలాగైనా చిరాకు పుట్టించాలని, ఈ కూత వింటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో దానికి చూపించాలని కుక్క అనుకుంది.
అప్పుడే దానికి ఒక ఐడియా తట్టింది.అదేంటంటే తను కూడా కోడి లాగానే కూత పెట్టాలనుకుంది.
అనుకున్నదే తడవుగా అది కూడా కొక్కొరోకో… అంటూ కూత వేసింది.

అయితే కుక్క నోటి నుంచి వచ్చిన ఆ సౌండ్ కోడిపుంజు అరిచినట్టు వినిపించింది.దీంతో ఆ కోడి పుంజు కూడా అవాక్కై చూసింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా అబ్బుర పడుతున్నారు.
ఈ కుక్కకి మామూలు టాలెంట్ లేదు.భలే ఇమిటేట్ చేసిందిగా.
దీనికి ఇమిటేషన్ లో ఒక గోల్డ్ మెడల్ ఇవ్వాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







