బాహుబలి సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా అవతరించాడు.ఒక్క సినిమాతోనే రాత్రికి రాత్రి పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.
ఈయనకు ఉన్న క్రేజ్ మరే హీరోకు లేదు.అయితే ప్రభాస్ బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ కొట్టలేక పోయాడు.
ప్రభాస్ బాహుబలి తర్వాత చేసిన రెండు సినిమాలు విజయం సాధించక పోవడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు.
ప్రెసెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో సలార్ ఒకటి.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచు కుంటున్నారు.
కెజిఎఫ్ భారీ విజయం సాధించడంతో సలార్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తుండగా.
శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇది ఇలా ఉండగా ఈయన లుక్స్ పై గత కొన్ని రోజులుగా ట్రోల్స్ వస్తున్న విషయం తెలిసిందే.
సాహో సినిమా తర్వాత ఈయన చాలా లావుగా అయిపోయాడు.అంతకు ముందు ఉన్న స్టైలిష్ ప్రభాస్ కనిపించక ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు.ఆదిపురుష్ షూటింగ్ సమయంలో ఈయన లుక్ పై హిందీ ప్రేక్షకులు చాలా విమర్శలు చేసారు.ఈయన లుక్ చాలా ఇబ్బందికరంగా ఉంది అంటూ ట్రోల్స్ చేసారు.
ఇక ఇటీవలే ఓం రౌత్ ఇంట్లో జరిగిన గెట్ టు గెదర్ లో ప్రభాస్ లుక్ అందరిని ఆశ్చర్య పరిచింది.మునుపటి కల కనిపిస్తుందని.ఇంకొద్దిగా ఈయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తే డార్లింగ్ మునుపటి లుక్ లోకి మారిపోవడం ఖాయం అని అనుకున్నారు.ఇలా అనుకుని ఫ్యాన్స్ సంతోష పడే లోపే మళ్ళీ ఈయన విచిత్రమైన గెటప్ లో కనిపించి అందరిని షాక్ కు గురి చేశారు.
ప్రాజెక్ట్ కే కోసం అమితాబ్ హైదరాబాద్ రాగా ఈయనను ప్రముఖులు కలిశారు.ఇందులో డార్లింగ్ కూడా ఉన్నారు.ఈయన వేర్ చేసిన దుస్తులపై ఇప్పుడు ట్రోలింగ్ జరుగు తుంది.ఈ ఫొటోల్లో ప్రభాస్ లూజ్ గా ఉండే సాధారణ దుస్తులు ధరించి కనిపించారు.ఇలా వారాల వ్యవధిలోనే ఈయన లుక్ లో మార్పులు ఫ్యాన్స్ ను కలవరానికి గురి చేస్తున్నాయి.ఈయన బయట కూడా స్టైలిష్ గా కనిపించాలని కోరుకునే వారికీ నిరాశనే ఎదురైంది.
మరి ఫ్యాన్స్ కోసం అయినా ఈయన ఫిట్ నెస్ మీద మరియు స్టైలింగ్ మీద ఫోకస్ పెడతారో లేదో చూడాలి.