ఎన్టీఆర్, చంద్రబాబు పై కొడాలి నాని సంచలన కామెంట్స్ !

వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు మాజీ మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్, చంద్రబాబు లపై సంచలన కామెంట్స్ చేశారు.ఎప్పుడు చంద్రబాబు , లోకేష్ టిడిపి నాయకుల పై తనదైన శైలిలో విరుచుకుపడుతూ , విమర్శలు చేస్తున్న కొడాలి నాని తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చంద్రబాబు,  తెలుగుదేశం పార్టీ పై సంచలన విమర్శలు చేశారు ఎన్టీఆర్ ను ఉద్దేశించి టిడిపి నాయకులు చేస్తున్న విమర్శలను నాని తిప్పికొట్టారు.” ఎన్టీఆర్ జాతి సంపద.ఆయన ఫోటోను ఎవరైనా వాడుకోవచ్చు.

 Kodali Nani Sensational Comments On Chandrababu Chandrababu, Ntr, Jagan, Cbn, Ys-TeluguStop.com

ఎన్టీఆర్ ఫొటో రంగులకు టిడిపి కి సంబంధం ఏమిటి ? ఆనాడు ఎన్టీఆర్ ను టిడిపి నుంచి సస్పెండ్ చేశారు.ఆ లెటర్ కూడా నా దగ్గర ఉంది.

      ఈ అంశంపై బహిరంగ చర్చకు కూడా సిద్ధం.బొమ్ములూరు లో నా సొంత డబ్బుతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నేనే ఏర్పాటు చేశా.ఆ శిలాఫలకాన్ని తొలగించడం తోనే వివాదం మొదలైంది.గుడివాడ నియోజకవర్గ మొత్తం ఎన్టీఆర్ , వైయస్సార్ విగ్రహాలను ఏర్పాటు చేసి వైసిపి రంగులు వేయిస్తా, ఎవరేం చేస్తారో చూస్తా, సొంత నియోజకవర్గం చంద్రగిరిలో టిడిపిని గెలిపించి లేని చంద్రబాబు .గుడివాడలో ఏం గెలిపిస్తారు ? టీడీపీ అధికారంలో ఉండగా నా పార్టీ ఆఫీస్ ఖాళీ చేయించి, నా మీద 60 కేసులు పెట్టించారు.ఎన్టీఆర్ వైయస్సార్ ఆశీస్సులతో, ఐదవ సారి కూడా గెలవబోతున్నాను.

నా ప్రత్యర్ధి చంద్రబాబు అయితే బాగుంటుంది.
 

Telugu Ap, Chandrababu, Jagan, Lokesh, Ntr Startue, Ysrcp-Politics

    ఒకసారి కాటా దెబ్బ ఏంటో చూపిస్తా.టిడిపి నేతలు బహిరంగ సభ అంటూ నాలుగు జిల్లాలో జనసమీకరణ చేస్తూ విపరీతంగా డబ్బులు ఖర్చు చేస్తున్నారు.మంత్రి పదవి లేకపోవడం వల్ల నాకు ఎలాంటి అసంతృప్తి లేదు.

మంత్రులుగా ఉన్న వాళ్లు ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు సమాధానం చెబుతారు.ఎవరైనా పార్టీపై విమర్శలు చేస్తే నేను చూస్తూ ఊరుకోను ” అంటూ కొడాలి నాని చంద్రబాబు టిడిపి లపై మండిపడ్డారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube