బిగ్ బాస్ 6 లోకి ఎంట్రీ ఇవ్వనున్న పేదల లాయర్..ఎవరంటే?

బుల్లి తెరపై ప్రసారమవుతున్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఇప్పటికే పలు భాషలలో ప్రసారమౌతున్న ఈ కార్యక్రమం తెలుగులో కూడా బుల్లితెరపై అయిదు సీజన్లను పూర్తిచేసుకుని, ఓటీటీలో నాన్ స్టాప్ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకుంది.

 Who Is The Poor Lawyer Is Going To The Bigg Boss 6, Bigg Boss 6, Tollywood, Lawy-TeluguStop.com

ఈ నాన్ స్టాప్ కార్యక్రమంలో భాగంగా బిందు మాధవి విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఇక త్వరలోనే బిగ్ బాస్ నిర్వాహకులు బుల్లితెరపై సీజన్ 6 కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన పనులన్నీ శరవేగంగా జరుగుతున్నాయి.అలాగే కంటెస్టెంట్ ల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి అయిందని వార్తలు వినపడుతున్నాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు వీళ్ళు అంటూ పెద్దఎత్తున కొందరి పేర్లు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.ఇకపోతే ఈ కార్యక్రమంలో కామన్ మ్యాన్ ఎంట్రీ ఉంటుందనే విషయం మనకు తెలిసిందే.

అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనే కామన్ మ్యాన్ ఎవరు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.

బిగ్ బాస్ చరిత్రలో ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా ఒక యంగ్ లాయర్ ను కామన్ మాన్ ఎంట్రీ గా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించనున్నారు.

ఖమ్మం జిల్లాకు చెందిన తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ సుబ్బు సింగ్ పోగు బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వనున్నారనే వార్తలు వస్తున్నాయి.ఈయన పేదల లాయర్ గా పేరు సంపాదించుకున్నారు.

పేదల తరపున వాదిస్తూ ఎన్నో కేసులలో విజయం పొందిన ఈయనకు పేదల లాయర్ అనే పేరు వచ్చింది అయితే ఈయన కేవలం లాయర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా నటించారు.అలాగే నాటక రంగంలో కూడా ఎంతో మంచి పేరు ఉండటంతో నిర్వాహకులు ఈయనను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై అధికారక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube