ఉడత ప్రాణాలను నిలిపిన యువతిపై నెటిజన్ల ప్రశంసలు

ఇటీవల కాలంలో మనుషులకు ఎదుటి వారు ఎంత కష్టాల్లో ఉన్నా పట్టించుకునే తీరిక ఉండడం లేదు.తమ కళ్ల ముందు ఒకరి ప్రాణాలు పోతున్నా వాటిని వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టడం కోసమే ఆలోచిస్తుంటారు.

 Netizens Praise Young Woman For Saving Squrill Lives Squrill, Viral Latest, Ne-TeluguStop.com

కాసిన్ని మంచి నీళ్లు దొరకక వేసవి సమయంలో ఎంతో మంది అల్లాడుతుంటారు.ఇక నోరు లేని మూగజీవుల సంగతి గురించి వేరే చెప్పనవసరం లేదు.

మనుషులనే పట్టించుకోని వారు ఇక మూగజీవులను ఏం పట్టించుకుంటారు.అంత తీరిక కూడా ఎవరికీ ఉండదు.

అయితే సోషల్ మీడియాలో ఇటీవల బాగా వైరల్ అయిన వీడియోలో ఓ యువతి తన పని మీద ఎక్కడికో వెళ్తూ ఓ నోరులేని జీవి ప్రాణం కాపాడింది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

బ్యూటెంగెబిడెన్ అనే ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియో ఇటీవల పోస్ట్ చేశారు.అందులో ఓ యువతి తాను కారులో వెళ్తూ ఓ ఉడతను చూసింది.అది దాహంతో అల్లాడిపోయి అటూ ఇటూ తిరుగుతోంది.ఎక్కడైనా నీటి చుక్క కనపడితే దానిని తాగేందుకు తహతహలాడిపోతోంది.చివరికి ఓ ఆకుపై నీటి చుక్క కనపడినా దాని కోసం పరుగులు పెడుతోంది.దీనిని ఆ యువతి చూసి చలించిపోయింది.

వెంటనే ఆ యువతి కారు దిగింది.వెంటనే ఆ ఉడత దగ్గరకు వెళ్లింది.

తన వద్ద ఉన్న బాటిల్ మూత తీసి, వాటర్ ఆ ఉడతకు తాగించింది.వెంటనే ఏ మాత్రం భయ పడకుండా వెంటనే గటగటా తాగేసింది.

ఈ దృశ్యాన్ని వేరే వాళ్లు తమ ఫోన్‌లో వీడియో తీశారు.దానిని ట్విట్టర్‌లో పెట్టగానే నెటిజన్లు విశేషంగా స్పందించారు.

ఆ యువతిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఆమెకు మానవత్వం ఉందని, అంత హడావుడిగా ఉండే రోడ్డులో ఆ ఉడత అవస్థలు ఆమె గమనించిందని గుర్తు చేస్తున్నారు.

ఆమె స్పందించిన తీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube