ఏపీ ప్రజలు ఈసారి తాయిలాలకు ఆశపడతారా? అభివృద్ధిని కోరుకుంటారా?

ప్రజలు చాలా తెలివైన వాళ్లు.ఎన్నికల్లో ఎవరికి ఓట్లు వేయాలంటే వాళ్లకే వేస్తారు.

2014లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అనుభవం ఉన్న నేత కావాలని చంద్రబాబుకు అధికారం కట్టబెట్టారు.తీరా 2019 ఎన్నికలకు వచ్చేసరికి ప్రజలు ప్లేటు ఫిరాయించేశారు.

తనకు ఒక్క అవకాశం ఇచ్చి చూడాలని కోరినందుకు జగన్‌కు అధికారం కట్టబెట్టేశారు.అయితే 2024 ఎన్నికల్లో ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తారన్న విషయం ఆసక్తికరంగా మారింది.

మరోసారి అనుభవం కావాలని చంద్రబాబుకు ఓటు వేస్తారా లేదా కుర్ర సీఎం పాలనే బాగుందని మళ్లీ జగన్‌కే ఓటు వేస్తారా లేదా తనకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుతున్న పవన్ కళ్యాణ్‌కు వేస్తారా అన్న పాయింట్ చుట్టూ ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి.అయితే ప్రజల ఆలోచనలు ఆ రోజుకు ఎలా ఉంటే వారికే ఓటు వేస్తారని చాలా మంది భావిస్తున్నారు.

Advertisement

కానీ వాళ్ల మైండ్‌ను ప్రభావితం చేయగల సామర్థ్యం ఎవరికి ఉందనేది ఇక్కడ పాయింట్.ఉమ్మడి ఏపీ నుంచి చూసుకుంటే ప్రతి ఎన్నికల్లో నిర్దిష్టమైన తీర్పునే ప్రజలు ఇచ్చారు.

ఏ ఎన్నికలోనూ హంగ్ వచ్చిన సందర్భాలు లేవు.ఉమ్మడి ఏపీలో ఇస్తే కాంగ్రెస్ పార్టీకి లేకపోతే తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చారు.

రాష్ట్రం విడిపోయాక.ఓసారి టీడీపీకి, మరోసారి వైసీపీకి కూడా అధికారం ఇచ్చి పరీక్షించారు.

మరోవైపు కర్ణాటక, మహారాష్ట్రలలో రాజకీయాలను పరిశీలిస్తే అక్కడ హంగ్ రావడం వల్ల రాజకీయ సంక్షోభాలు నెలకొన్నాయి.కొద్దిరోజులకే ప్రభుత్వం పడిపోవడం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

సీఎంలు మారిపోవడం వంటివి జరిగాయి.అయితే ఇదే సిట్యువేషన్ ఏపీలో నెలకొనే అవకాశాలు లేవనే చెప్పాలి.

Advertisement

గత ఎన్నికల్లో ప్రజలు వైసీపీని అంచనాలను మించి నమ్మారు.కేంద్రంలో మోదీ సర్కార్ చంద్రబాబు అంటే గిట్టకుండా ఉంటోందని.

అదే జగన్‌తో అయితే సయోధ్యగా ఉంటుందని విశ్వసించారు.అందువల్ల వైసీపీతో ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందని నమ్మారు.

అలాగే విభజన హామీలు కూడా నెరవేరుతాయని, చక్కని రాజధాని ఉంటుందని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని కూడా ఆశించి జగన్ పార్టీని ఏకపక్షంగా గెలిపించేశారు.

అయితే ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది.గత మూడేళ్ళ వైసీపీ పాలనలో ప్రజల ఆశలు అయితే తీరలేదు.సంక్షేమం పరంగా పాస్ మార్కులు వేయించుకున్న జగన్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో పాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యారని ప్రజలు విమర్శిస్తున్నారు.

ఈసారి ఎన్నికల్లో ఎవరి తాయిలాలకు ఆశపడకుండా ఏపీని రానున్న ఐదేళ్లలో ఎవరు అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్తారో వారికే జనాలు కచ్చితంగా ఓటేయడం జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఎలా చూసినా మరోసారి ప్రాంతీయ పార్టీకే ప్రజలు పట్టం కట్టే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

తాజా వార్తలు