కేటీఆర్ వెంట తిరుగుతున్న చంద్రబాబు శిష్యుడు

రాజకీయాల్లో విచిత్ర పరిస్థితి నెలకొంటుంది.ఈరోజు శత్రువుగా ఉన్న వ్యక్తి రేపు మిత్రుడు కావొచ్చు.

లేదా ఈరోజు మిత్రుడు కూడా వ్యక్తి రేపు శత్రువుగా మారే అవకాశం ఉండొచ్చు.కాబట్టి రాజకీయాల్లో వ్యక్తులు శాశ్వతం కాదు అనే నానుడి ఉంది.

ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న నామా నాగేశ్వరరావు విషయంలో ఈ నానుడి సరిపోతుంది.దేశంలో రాష్ట్రపతి ఎన్నిక రాజకీయం హాట్ టాపిక్‌గా నడుస్తోంది.

దీంతో రాజకీయ పార్టీలన్నీ రెండుగా చీలిపోయాయి.బీజేపీకి మద్దతిచ్చే వాళ్లందరూ ఓ వైపు.

Advertisement

మిగతా పార్టీలన్నీ విపక్షాల అభ్యర్థి వైపు నిలబడ్డాయి.రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించింది.

ఈ మేరకు ఆయన నామినేషన్ కార్యక్రమం సోమవారం నాడు జరిగింది.ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకాకపోవడంతో ఆయన తన కుమారుడు కేటీఆర్‌ను, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావులకు ఆ బాధ్యతను అప్పగించారు.

దీంతో ఢిల్లీలో కేటీఆర్ వెనుకే నామా నాగేశ్వరరావు తిరుగుతున్నారు.అయితే ఒకప్పుడు నామా నాగేశ్వరరావు కరుడుగట్టిన టీడీపీ నేత.టీడీపీలో ఉన్నప్పుడు చంద్రబాబు శిష్యుడు అని నామాకు పేరుండేది.

అలాంటి ఆయన ఇప్పుడు కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మారారు.దీని వెనుక లోగుట్టు రాజకీయం ఏమైనప్పటికీ ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు కేటీఆర్ వెంట దేశ రాజధానిలో తిరుగుతుండటం ఆసక్తి రేపుతోంది.రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి గులాబీ దండు తరఫున ఢిల్లీ లాబీయింగ్‌లో నామా నాగేశ్వరరావు కీలక పాత్ర పోషిస్తారని ప్రచారం జరుగుతోంది.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

విచిత్రం ఏంటంటే.రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల అభ్యర్థిగా నిలబడ్డ యశ్వంత్ సిన్హా కూడా ఒకప్పుడు బీజేపీకి సంబంధించిన వ్యక్తే.

Advertisement

ఆ పార్టీలో కీలక బాధ్యతలను యశ్వంత్ సిన్హా నిర్వర్తించారు.అయితే అనంతరం ఆయన తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు.ఆయన కుమారుడు మాత్రం బీజేపీలోనే ఉన్నారు.

యశ్వంత్ సిన్హా ఒక్కరే బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన రాజకీయం ఆయన చేసుకుంటున్నారు.ఇప్పుడు ఆయన తృణమూల్ కాంగ్రెస్ గూటి పక్షి మాత్రమే కాదు టీఆర్ఎస్ గూటి పక్షి కూడా.

మరి టీఆర్ఎస్ మద్దతు ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్ సిన్హా విజయం సాధిస్తారో లేదో కాలమే సమాధానం చెప్పాలి.

తాజా వార్తలు