విదేశాలలో చాలా మందికి చేపలు వేటాడడం ఓ హాబీ.వారాంతాల్లో సమీపంలోని కొలనులు, కాలువలు, సరస్సులలో చేపలు పడుతూ ఉంటారు.
ఇలాగే చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి భారీ చేప దొరికింది.దాని పొట్ట కూడా చాలా పెద్దగా ఉంది.
ఇక పొట్టలో ఏవో విలువైన వస్తువులు ఉన్నాయేమోనని కోసి చూశాడు.దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
తీరా వాటిని బయటకు తీసి, నవ్వుల్లో మునిగిపోయాడు.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
అమెరికాలోని ఇండియానా స్టేట్ లారెన్స్‌బర్గ్ సమీపంలోని ఓహియో నదిలో రిచర్డ్ కేసర్, జోన్ లూప్ గత ఆదివారం ఫిషింగ్ కోసం వెళ్లారు.వారు గేలం వేయగానే ఓ భారీ బ్లూ క్యాట్‌ఫిష్‌ను పట్టుకున్నారు.
దానిని పడవలో ఎక్కించుకున్నప్పుడు దాని కడుపు చాలా పెద్దదిగా ఉందని వారు గమనించారు.కొన్ని చేపలు వాంతి చేసుకుంటే, ఆ వ్యర్థాలను సెంట్‌ల తయారీలో వినియోగిస్తారు.
ఆ వ్యర్థాలను కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తుంటారు.అలాంటి చేప దొరికిందని వారిద్దరూ భావించారు.
పైగా పొట్ట కూడా ఉబ్బి ఉండడంతో సంతోషంలో మునిగిపోయారు.దాని కోసి చూడగానే అందులో ఉన్నవి చూసి అవాక్కయ్యారు.
చేపలు కొన్ని గుడ్లు లేదా చిన్న జీవులను మింగివేసి ఉండవచ్చని తాము మొదట భావించానని, అయితే తర్వాత క్యాట్‌ఫిష్ పొట్ట కోసి చూశామని పేర్కొన్నారు.రెండు గట్టి వస్తువులు కనిపించినట్లు చెప్పారు.
చివరికి అందులో నుంచి తీయగానే ఒక బాల్ దొరికింది.మరో వస్తవును కూడా తీయగా అది సెక్స్ టాయ్ అని తెలుసుకున్నారు.
వీరు ఈ విషయాన్ని ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యంలో మునిగిపోయారు.







