క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. మరాఠి సూపర్ హిట్ మూవీ నటసామ్రాట్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ లాంటి స్టార్స్ నటిస్తున్నారు.
సినిమాలో శివాత్మిక కూడా నటిస్తుంది.దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా సినిమా మరో 10 రోజుల షెడ్యూల్ పెండింగ్ ఉందట.
నిర్మాతకు మధ్యలో ఎమౌంట్ అడ్జెస్ట్ అవక షూటింగ్ కొన్నాళ్లు ఆపేశారు.అయితే రంగమార్తాడ బజ్ బాగుండటంతో నిర్మాతకు మళ్లీ ఆశలు ఏర్పడ్డాయి.
త్వరలోనే 10 రోజుల షూటింగ్ పూర్తి చేసి ఆగష్టులో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట.రంగమార్తాండ సినిమాకు ఓటీటీల నుండి ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట.కానీ చిత్రయూనిట్ మాత్రం ఆ ఆఫర్లని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.రంగమార్తాండ ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.
కృష్ణవంశీ ఎలాగైనా సరే ఈ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు.రంగమార్తాండ సినిమాలో బ్రహ్మానందం సీరియస్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.
ఈ సినిమాలో ఆయన అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారని టాక్. కృష్ణవంశీ కూడా ఈ సినిమాని చాలా ఫోకస్ తో చేస్తున్నారు.
సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని.తప్పకుండా సినిమా ఆడియెన్స్ అంచనాలకు తగినట్టుగా ఉంటుందని అంటున్నారు.







