టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నా స్టార్ హీరోయిన్ సమంతకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.సమంత నటించిన సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించగా ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై సమంత ఎక్కువగా దృష్టి పెట్టారు.
కెరీర్ విషయంలో సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారు.సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు ఈ ఏడాదే రిలీజ్ కావాల్సి ఉంది.
అయితే నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలామంది నెటిజన్లు సమంతను టార్గెట్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.ఇలా సమంతను నెటిజన్లు టార్గెట్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి.
విడాకుల తర్వాత సమంత మరింత గ్లామరస్ గా కనిపించడానికి ప్రయత్నిస్తున్నారు.స్పెషల్ సాంగ్స్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో తరచూ గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తున్నారు.

చైతన్య సమంత విడాకుల వ్యవహారంలో సమంతదే తప్పు అని ఎక్కువమంది భావిస్తుండటం గమనార్హం.సోషల్ మీడియాలో సమంత పరోక్షంగా ఇతరుల గురించి ప్రస్తావిస్తూ పెడుతున్న పోస్టులు సైతం అభిమానులకు కోపం తెప్పిస్తుండటం గమనార్హం.సమంత సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా ఆమెను ట్రోల్ చేసేవాళ్లు మాత్రం ట్రోల్ చేస్తూనే ఉన్నారు.విడాకులకు సంబంధించి రీజన్ వెల్లడించకపోవడం కూడా ఆమెపై ట్రోలింగ్ కు కారణమవుతుంది.
నాగాచైతన్య నుంచి అభిమానులకు ఏవైనా సూచనలు వస్తే మాత్రమే ఈ పరిస్థితిలో మార్పు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.థాంక్యూ ప్రమోషన్స్ లో భాగంగా నాగచైతన్య ఈ విషయాల గురించి ఏమైనా మాట్లాడతాడేమో చూడాలి.
సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి నాగచైతన్య ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.కెరీర్ విషయంలో నాగచైతన్య, సమంత ఆచితూచి అడుగులు వేస్తున్నారనే సంగతి తెలిసిందే.







