ఊడిన‌ జుట్టు మ‌ళ్లీ తిరిగి రావ‌డం లేదా..? అయితే ఈ హెయిర్ స్ప్రే మీకోస‌మే!

సాధార‌ణంగా కొంద‌రికి రోజూ కొంచెం కొంచెంగా జుట్టు ఊడుతుంది.కానీ, మ‌ళ్లీ కొత్త జుట్టు తిరిగి రాదు.

హెయిర్ గ్రోత్ లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా జ‌రుగుతుంటుంది.దాంతో ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం నానా పాట్లు ప‌డుతుంటారు.

ర‌క‌ర‌కాల షాంపూలు, నూనెలు వాడుతుంటారు.ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాల‌ను పాటిస్తారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు వ‌ర్రీ అవ్వ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే హెయిర్ స్ప్రెను వాడితే హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

Advertisement

దాంతో ఊడిన జుట్టు మ‌ళ్లీ తిరిగి వ‌స్తుంది.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ హెయిర్ స్ప్రేను ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బంగాళ‌దుంప‌ను తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి తొక్క‌తో పాటుగానే ముక్క‌లుగా క‌ట్ చేసి పెట్టుకోవాలి.ఒక ఉల్లిపాయ‌ను తీసుకుని తొక్క తొల‌గించి ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

అలాగే అర క‌ప్పు ఫ్రెష్ అలోవెర జెల్‌ను తీసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బంగాళ‌దుంప ముక్క‌లు, ఉల్లిపాయ ముక్క‌లు, అలోవెర జెల్‌, వ‌న్ టేబుల్ స్పూన్ లెమ‌న్ జ్యూస్ వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మం నుంచి జ్యూస్‌ను స‌ప‌రేట్ చేసుకోవాలి.ఈ జ్యూస్‌లో రెండు టేబుల్ స్పూన్ల ఆముదం క‌లిపి బాగా మిక్స్ చేసుకుని స్ప్రే బాటిల్‌ను నింపుకుంటే హెయిర్ స్ప్రే సిద్ధ‌మైన‌ట్లే.దీనిని జుట్టు కుదుళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ఒక‌టికి రెండు సార్లు స్ప్రే చేసుకుని గంట లేదా రెండు గంట‌ల‌ పాటు వ‌దిలేయాలి.

పోలింగ్ ఏజెంట్ల నియామకంపై ఈసీ ఆదేశాలు
తల్లికి 15 లక్షల విలువ చేసే జ్యూవెలరీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. ఈ కొడుకు గ్రేట్ అంటూ?

ఆపై మైల్డ్ షాంపూతో త‌ల‌ స్నానం చేయాలి.నాలుగు రోజుల‌కు ఒక‌సారి ఇలా చేస్తే ఊడిన జుట్టు మ‌ళ్లీ ఒత్తుగా వ‌స్తుంది.

Advertisement

తాజా వార్తలు