శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయి రామ్ శంకర్, యషా శివకుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రం “వెయ్ దరువెయ్” ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా,హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయులు సమావేశంలో హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ.ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలు శర్వానంద్, అల్లరి నరేష్, విశ్వక్ సేన్ లకు పెద్దలకు ధన్యవాదములు.”యస్.ఆర్ కల్యాణ మండపం” తర్వాత శంకర్ పిక్చర్స్ తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ “వెయ్ దరువెయ్”.దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పిన కథ విన్న తరువాత నాకు “బంపర్ ఆఫర్” తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం నా అదృష్టం .ఈ కథ నాకు 100% సక్సెస్ ఫుల్ సినిమా అవుతుందని అనిపిస్తుంది.ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ గా వస్తున్న “వెయ్ దరువెయ్” టైటిల్ లోనే మాస్ కనిపిస్తుంది.
లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది.ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్, సతీష్ ముత్యాల డి ఓ పి ఇస్తున్నారు.
ఈ సినిమాతో యషా శివకుమార్ హీరోయిన్ గా పరిచయ మవుతుంది.తను కన్నడ లో శివరాజ్ కుమార్ తో చేసిన సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది.
తన క్యారెక్టర్ కూడా నాకు ఈక్వల్ గా ఉంటుంది.నాకింత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయడానికి ప్లాన్ చేసి ఈ సంవత్సరం లోనే రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు అన్నారు.

చిత్ర నిర్మాత దేవరాజ్ పొత్తూరు మాట్లాడుతూ.ఇక్కడకు వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్య వాదములు.నవీన్ రెడ్డి ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథ చెప్పగానే నాకు బాగా నచ్చి ఈ సినిమా చేద్దాం అని చెప్పాను.
శంకర్ పిక్చర్స్ ప్రెజెంట్స్ లో మేమంతా కలసి నిర్మిస్తున్నాము.ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు.మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.
చిత్ర దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ…ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోలకు, పెద్దలకు ధన్యవాదములు.
నెక్స్ట్ మంత్ షూట్ కు వెళ్తున్నాము.మా “వెయ్ దరువెయ్” సినిమాను సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చెయ్యాలని ప్లాన్ చేశాము.
నిర్మాతకు ఈ కథ చెప్పగానే కథ బాగుందని ఈ సినిమాకు ఎం కావాలో ఏర్పాటు చేసుకోమని చెప్పడం జరిగింది.ఇలాంటి మంచి కథను చేసే అవకాశం ఇచ్చినందుకు వారికి నా ధన్యవాదములు.
ఈ సినిమాలో కాశీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు, ఇంకా ఈ సినిమాలో పోసాని, సప్తగిరి ఇలా చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు.వీరితో పాటు మంచి టెక్నిషియన్స్ దొరికారు ఫుల్ ఔట్ ఔట్ ఎంటర్ టైనర్ కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది అన్నారు.

హీరోయిన్ యషా శివకుమార్ మాట్లాడుతూ.ఇది తెలుగులో నా మొదటి సినిమా.ఇలాంటి మంచి సినిమలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు.
నటుడు కాశీ విశ్వనాధ్ మాట్లాడుతూ.
దర్శకుడు మంచి కథ రాసుకున్నాడు.నవీన్ చెప్పిన కథ చాలా బాగా నచ్చింది .ఈ సినిమాకు హిట్ కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి.యస్.ఆర్.కళ్యాణ మండపం సినిమాను రిలీజ్ చేసిన శంకర్ పిక్చర్స్, సాయితేజ్ పిక్చర్స్ సంయుక్తంగా చేస్తున్న ఈ సినిమా “యస్.ఆర్.కళ్యాణ మండపం” అంత పెద్ద హిట్ అవ్వాలి.సాయిరాం శంకర్ తో ఇంతకు ముందు రీ సౌండ్ సినిమాకు కలసి వర్క్ చేశాను .తనకు,నవీన్ కు మంచి బ్రేక్ రావాలి.అలాగే నిర్మాత దేవరాజ్ కు ఎక్కువ డబ్బులు రావాలి అన్నారు.ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కథతో వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
ఈ కార్యక్రమానికి హీరో ఆకాష్ పూరి , నిర్మాత , కోడి దివ్య దీప్తి హాజరయ్యారు.

నటీ నటులు
హీరో : సాయి రామ్ శంకర్, హీరోయిన్ : యషా శివకుమార్ కాశీ విశ్వనాథ్,పోసాని కృష్ణ మురళి.
సాంకేతిక నిపుణులు :
బ్యానర్: సాయి తేజ ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: దేవరాజ్ పొత్తూరు, దర్శకుడు: నవీన్ రెడ్డి, కెమెరామెన్: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్.