పేరుకేనా తెలుగు సంఘాలు...తెలుగుకు వెలుగేది...??

విదేశాలలో ఉన్నా మాతృ భూమిపై ఉన్న మమకారం, సొంత బాష, తల్లి తండ్రులపై, స్నేహితులపై ఉన్న ప్రేమ ఎప్పటికి మర్చిపోకుండా ఉన్న ఎన్నారైలు ఎంతో మంది ఉన్నారు.తమకు తోచిన సాయం చేస్తూ ఊరి అభివృద్ధికి సహకరిస్తూ, మాతృ బాష ను తమ పిల్లలకు నేర్పిస్తూ ఎంతో ఆభిమానంగా ఉంటుంటారు.

 Telugu Language In Foreign Countries,telugu Language,foreign Countries, Gulf Cou-TeluguStop.com

అయితే కొందరికి మాత్రం ఇవేం పట్టవు అన్నట్టుగా వ్యవహరిస్తారు, వారి స్వార్థమో, తమకు ఇక బాషతో పనేంటనే ఆలోచనో ఏమో కానీ కొందరి తీరు మరీ జుగుప్సగా ఉంటుంది.ఓ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తె

తెలుగు బాషను విదేశాలలో తమ పిల్లలకు నేర్పించే వారు చాలా వరకూ తగ్గిపోతున్నారట.

పై పై కి తెలుగు వెలుగులు అంటూ వీర బాదుడు స్పీచ్ లు ఇచ్చినా తమ వరకూ వచ్చేసరికి మాత్రం పిల్లలకు వేరే బాషలను నేరిస్తున్నారట.ముఖ్యంగా అరబ్బు దేశాలలో ఉండే ఎన్నారైలు చాలా మంది తమ పిల్లలకు తెలుగుకు బదులుగా ఇతర బాషలపై పట్టు పెంపొందించేలా తర్ఫీదులు ఇస్తున్నారని తెలుస్తోంది.

అదేంటి వాళ్ళ ఇష్టం వాళ్ళది మనమేవరు వారిని వేలెత్తి చూపడానికి అనుకోవచ్చు కానీ పైకి తెలుగు బాషాభిమానులు అని చెప్పుకుంటూ వారి పిల్లలకే తెలుగు నేర్పక పోవడం తప్పే , అలాగే సొంత బాషపై గౌరవం లేని వాడు తల్లి ని సైతం ఏం గౌరవిస్తాడు.

గల్ఫ్ దేశాలలో సుమారు 190 స్కూల్ కేంద్రం అనుభందంగా సిబిఎస్ఈ బోర్డుకు అనుభందంగా నడుస్తున్నాయి.

వెలది మంది తెలుగు విద్యార్దులు ఇందులో చదువుతున్నా తెలుగు బాషను సెకండరీ బాషగా చేసుకుని నేర్చుకునే వారి సంఖ్య వేళ్ళపై లెక్క పెట్టవచ్చట.ఈ క్రమంలో తెలుగు భోదన చెప్పే స్కూళ్ళ సంఖ్య నేర్చుకునే వారు లేకపోవడంతో నానాటికి తగ్గిపోతున్నాయట.

దుబాయ్ లో సుమారు 30 కి పైగా సిబిఎస్ఈ అనుభంగా స్కూల్ ఉన్నా అందులో తెలుగు నేరుచుకునే వారు ఒక్కరు కూడా లేకపోవడం తెలుగు బాష అభిమానులకు ఆవేదన కలిగిస్తుంది.తెలుగు బాష అభివృద్ధి కోసం ఇంత చేస్తాం అంత చేస్తాం అంటూ పుట్టుకొస్తున్న ప్రవాస తెలుగు సంఘాలు ఈ విషయంపై ఆలోచన చేయాలని కోరుతున్నారు తెలుగు బాషాభిమానులు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube