కేవలం 5 నిమిషాల్లోనే.. కండెన్స్ మిల్క్ తయారీ ఎలా?

ప్రతీది మనం ఇంట్లోనే చేసుకోవచ్చు.ప్రతి ఫుడ్ ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

 How To Prepare Condense Milk At Home Details, Milk, Prepared, Condensed Milk, Pr-TeluguStop.com

కానీ ఇంట్లో ఎందుకులే అని చాలామంది బయట షాపు నుంచి తెచ్చుకుని ఉపయోగించుకుంటారు.బయట దొరికే ప్రొడక్ట్ లలో కల్తీవి, నకిలీవి కూడా ఉండవచ్చు.

అయితే ఇంట్లోనే చేసుకోవడం ద్వారా డబ్బు ఆదా చేసుకోవడంతో పాటు కల్తీ లేని స్వచ్ఛమైన పదార్థాలను తయారుచేసుకోవచ్చు.అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతోమంచి చేస్తుంది.

ఇప్పుడు కండెన్స్ మిల్క్ ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.రకరకాల స్వీట్స్, కేక్స్, ఐస్‌క్రీములలో కండెన్స్ మిల్క్ ను ఉపయోగిస్తూ ఉంటారు.చాలామంది షాప్ ల నుంచి మిల్స్ మెయిడ్ ని తెచ్చుకుని వీటిల్లో వేస్తూ ఉంటారు.అయితే ఇంట్లోనే కేవలం ఐదు నిమిషాల్లోనే మిల్క్ మెయిడ్ ని ఉపయోగించుకోవచ్చు.మిల్క్ మెయిడ్ తయారుచేసే విధానం, కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

పాల పొడి రెండు కప్పులు
పావు లీటర్ చిక్కని పాలు
పంచదార ఒక కప్పు
పావు టీ స్పూన్ బేకింగ్ సోడా
కాన్ ప్లోర్ ఒక చెంచా

Telugu Condense Milk, Condensemilk, Milk, Corn, Milk Maid, Prepared, Sugar, Late

తయారుచేసే విధానం

ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో పాల పొడి పంచదార బేకింగ్ సోడా కాన్ ఫ్లోర్ వేసి కలపాలి.ఆ తర్వాత అందులో పాలు పోసి ఉండలు కట్టకుండా కలపాలి.తర్వాత స్టవ్ వెలిగించి గిన్నెను స్టవ్ మీద పెట్టి మరిగించాలి.

పాలు చిక్కపడేవరకు తిప్పుతూ ఉండాలి.తర్వాత స్టవ్ ఆప్ చేయాలి.

ఇలా చేస్తే చాలు 5 నిమిషాల్లో కండెన్స్ మిల్క్ తయారయిపోతుంది.స్టవ్ మీద నుంచి తీసిన తర్వాత చల్లగా అయిన తర్వత మాత్రమే సర్వ్ చేసుకోవాలి.

ఒక గాజు సీసాలో కండెన్స్ పాత్రను నిల్వ చేసుకోవాలి.మూడు నెలల పాటు దీనిని వాడుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube