వైసీపీ రాజ్యసభ సభ్యుడు జగన్ కు అత్యంత సన్నిహితుడైన విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. జగన్ పైన ,వైసీపీ ప్రభుత్వం పైన ఎవరు విమర్శలు చేసినా తనదైన శైలిలో స్పందిస్తూ సోషల్ మీడియా ద్వారా కౌంటర్ లు ఇస్తూ , తమ రాజకీయ ప్రత్యర్ధులను వ్యంగ్యంగా విమర్శిస్తూ ఉంటారు.
ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంటూ ఉంటారు .జగన్ సైతం విజయసాయిరెడ్డికి ఎక్కువగా ప్రోత్సాహం, ప్రాధాన్యం ఇస్తూ మరింతగా ప్రోత్సహిస్తూ వస్తున్నారు.ఏపీలో వైసీపీ ప్రభుత్వం పై రాజకీయ ప్రత్యర్ధులు చేసే ప్రతి విమర్శ పై విజయ సాయి రెడ్డి స్పందిస్తూ కౌంటర్ ఇస్తూ ఉంటారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన తరచుగా విజయసాయి విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు.తాజాగా జనసేన బీజేపీ టీడీపీ పొత్తుకు వ్యవహారాలపై చంద్రబాబు లోకేష్ పై వెటకారంగా విమర్శలు చేశారు.
” ఈ గట్టునున్నావా తుప్పన్నా… ఆ గట్టునున్నావా పప్పన్నా …
ఆ గట్టు నుంటే జనసేనకు నిప్పు … ఈ గట్టు నుంటే బీజేపీ కి ముప్పు….మరి ఏ గట్టునుంటావు నారన్నా !
ఏ గట్టునైనా ఉన్నావో లేదో … కరకట్టనున్నావు నారన్నా !

అంటూ సోషల్ మీడియా ద్వారా వ్యంగ్య కవితను పోస్ట్ చేశారు.అంతకుముందు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ను ఉద్దేశించి ఆయన పేరు ప్రస్తావించకుండానే ఘాటుగా విమర్శలు సంధించారు.అలాగే టిడిపి సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి కూల్చివేత సంఘటనపైనా విజయసాయిరెడ్డి ఇదేవిధంగా స్పందించి విమర్శలు చేశారు. విజయసాయి విమర్శలకు సమాధానం చెప్పేందుకు సదరు నాయకులు ప్రయత్నించకపోవడమే కొసమెరుపు.
ఒకవేళ స్పందిస్తే మరింత తీవ్ర స్థాయిలో విరుచుకుపడతారు అనే భయమూ ఆయన కల్పించడమే కారణం.







