షాకింగ్ సర్వే : అమెరికాలో ఆ ఐదు రాష్ట్రాలలో భారతీయ విద్యార్ధులే అధికమట..రీజన్ ఏంటంటే..

అగ్ర రాజ్యం అమెరికా వెళ్లి చదువుకుని అక్కడే ఉద్యోగం సంపాదించాలని ఎంతో మంది కలలు కంటుంటారు.ముఖ్యంగా వీరిలో భారతీయ విద్యార్ధుల సంఖ్య ఎక్కువే.

 Number Of Indians Studying In Us High In These Five States,america,indians,us,in-TeluguStop.com

అంతేకాదు అమెరికా వెళ్తున్న వారిలో అక్కడ స్థిరపడిన వలస విద్యార్ధులలో భారతీయ విద్యార్ధుల సంఖ్య పెద్దది.అయితే భారత్ నుంచీ అమెరికా వెళ్తున్న విద్యార్ధులలో మెజారిటీ శాతం మంది అమెరికాలో ఐదు రాష్ట్రాలనే ఎంచుకుంటున్నారట.

తాజాగా ఓ సర్వే తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా , మసాచుసెట్స్, న్యూయార్క్, ఇల్లినాయ్ రాష్ట్రాలనే భారతీయ విద్యార్ధులు ఎంచుకున్తున్నట్టుగా సర్వే వెల్లడించింది…

ఈ ఐదు రాష్ట్రాలలో ఇల్లినాయ్ రాష్ట్రంలో విదేశీ విద్యార్ధుల వాటాలో భారతీయ విద్యార్ధుల శాతం సుమారు 27 శాతంగా ఉందట.ఇక టెక్సాస్ రాష్ట్రంలో 22 శాతం మంది ఉండగా, న్యూయార్క్ లో 18 శాతం మంది, కాలిఫోర్నియా లో 14 శాతం మంది, మసాచుసెట్స్ లో 20 శాతం మంది భారతీయ విద్యార్ధులు ఉన్నారట.

ఈ రాష్ట్రాలలోనే భారతీయ విద్యార్దులు ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే.

అమెరికాలో ప్రఖ్యాత వర్సిటీలు అన్నీ ఈ ఐదు రాష్ట్రాలలోనే ఉండటంతో పాటు, ఇక్కడ విద్యా ప్రమాణాల స్థాయి ఎక్కువగా ఉండటంతో ఈ రాష్ట్రాలనే ఎంచుకుంటున్నారట.

ఇదిలాఉంటే భారతీయ విద్యార్ధులతో పాటు పోటీ పడుతున్న వారిలో చైనా విద్యార్ధులు కూడా ఎక్కువగానే ఉన్నారట.అంతేకాదు విదేశీ విద్యార్ధులు చెల్లించే ఫీజులే అత్యదికమని అందులో భారతీయ విద్యార్ధుల ద్వారా వచ్చే ఆదాయం ఈ ఐదు రాష్ట్రాలలో ఉన్న వర్సిటీలలో అత్యధికంగా ఉంటుందని సదరు సర్వే వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube