నారాయణ స్కూల్ ముందు విద్యార్థి సంఘం ఆందోళన.స్కూల్ పై దాడికి విద్యార్థి సంఘం నేతలు,ఫర్నిచర్ ధ్వంసం.
రంగంలోకి దిగిన పోలీసులు,పరిస్థితి ఉద్రిక్తం.విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసిన పోలీసులు.
సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని నారాయణ స్కూల్ ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారని ఆరోపిస్తూ పి.డి.ఎస్.యు ఆధ్వర్యంలో మంగళవారం స్కూల్ ముందు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది.విద్యా శాఖ అనుమతి లేకుండా నారాయణ స్కూల్ ఎలా నడుపుతారని ప్రశ్నించగా,స్కూల్ యాజమాన్యం కూడా పి.డి.ఎస్.యు నేతలతో వాగ్వాదానికి దిగడంతో స్కూల్ లోకి చొచ్చుకొనిపోయిన విద్యార్థి సంఘం నేతలలు ఆగ్రహంతో దాడికి దిగడంతో స్కూల్ లో ఫర్నిచర్ ధ్వంసమైంది.దీనితో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగం ప్రవేశం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎట్టకేలకు పోలీసులు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు నాయకులు మాట్లాడుతూ గతంలో బేబీ మూన్ స్కూల్ పేరుతో నడిచిన భవనంలో ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ స్కూల్ నడపడం జరుగుతుందన్నారు.నారాయణ స్కూల్ పేరుతో విద్యార్థుల వద్ద అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యార్థులను,తల్లిదండ్రులను మోసం చేస్తున్న నారాయణ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,స్కూల్ ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.విద్యాశాఖ అనుమతులు లేకుండా నారాయణ స్కూల్ ఎలా నడుస్తుందో విద్యా శాఖ అధికారులకే తెలియాలని,నారాయణ పేరుతో పిల్లల తల్లిదండ్రుల అధిక మొత్తంలో ఫీజులు గుంజుతుంటే అధికారులు ఎందుకు మొద్దు నిద్ర పోతున్నారని,చట్ట విరుద్ధంగా స్కూల్ నడుపుతున్న వారిని వదిలేసి, న్యాయం చేయాలని అడుగుతున్న విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేయడం ఏమిటని ఆవేదన వ్యక్తం చేశారు.