క్లౌడ్‌ఫ్లేర్‌లో సమస్యలు... ప్రపంచ వ్యాప్తంగా వెబ్‌సైట్స్‌ డౌన్ అయ్యాయి.. మీకు జరిగిందా?

తాజాగా ఓ సమస్య అనేకమందికి తలనొప్పిగా మారింది.నేడు దాదాపు 90% మంది ఆన్లైన్ వేదికగా అన్ని పనులు చేస్తున్నారు.

 Problems With Cloudflare Websites Around The World Are Down Did It Happen To Yo-TeluguStop.com

వుద్యోగం నుండి వ్యాపారం వరకు అందరూ ఆన్లైన్ నే ఆశ్రయిస్తున్నారు.ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక వెబ్‌సైట్స్‌ మొరాయించాయి.

వెబ్‌సైట్‌ క్లిక్‌ చేస్తే 500 ఎర్రర్‌ చూపిస్తున్నాయి.దీనిపై ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ట్రేడింగ్ యాప్‌ అయినటువంటి జెరోధా, అప్‌స్టాక్స్‌ లాంటి ఫేమస్‌ యాప్స్‌ కూడా కనెక్టివిటీ సమస్యను చవిచూడటం కొసమెరుపు.

అందువలన ఈ సమస్యపై జెరోధా తాజాగా తన ట్విట్టర్ హ్యాండిల్‌లో స్పందించింది.

ఈ సందర్భంగా కొన్ని ISPలలోని క్లౌడ్‌ఫ్లేర్ నెట్‌వర్క్ ద్వారా కైట్‌లో కనెక్టవిటీ సమస్య వచ్చినట్టు గుర్తించామని చెప్పుకొచ్చింది.సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు మొదలుపెట్టామని రాసుకొచ్చింది.అయితే యూజర్లు టైం వెస్ట్ చేయకుండా ప్రత్యామ్నాయ ఇంటర్నెట్ కనెక్షన్‌ని ఉపయోగించుకోవాలని సూచించింది.ప్రపంచవ్యాప్తంగా చాలా వ్యాపార సంస్థలు ఈ క్లౌడ్‌ఫ్లేర్ (నెట్‌వర్క్ ట్రాన్సిట్, ప్రాక్సీ, సెక్యూరిటీ ప్రొవైడర్) ఉపయోగించుకుంటున్నాయి.

దీంట్లోనే సమస్య తలెత్తిందని అభిప్రాయపడింది.

ఒక వేళ మీరు జెరోధా వెబ్‌సైట్‌లు లేదా యాప్‌లను ఉపయోగించడంలో సమస్యలు ఎదుర్కొంటే వేరే ISPకి మారడానికి ప్రయత్నించాలని జెరోధా ట్వీట్టర్‌లో అభ్యర్థించింది.

దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేయడం విశేషం.ఇక డౌన్‌ డైరెక్టర్‌లో చూస్తే, జెరోధా కాకుండా చాలా వ్యాపార సంస్థలు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

క్లౌడ్‌ఫ్లేర్‌ వచ్చిన సమస్య కారణంగానే ఈ సమస్య తలెత్తినట్టు చూపిస్తోంది.అమెజాన్ సర్వర్‌ కూడా ఇదే సమస్య ఎదుర్కొంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube