టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈమద్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న విషయం తెల్సిందే.తెలుగు లో ఈ అమ్మడు ఇప్పటికే రెండు సినిమా లు పూర్తి చేసి విడుదలకు సిద్దంగా ఉంది.
మరో వైపు సమంత తమిళంలో కూడా ఒక సినిమా ను కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.ఇక బాలీవుడ్ లో వరుసగా సినిమా ను చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ లో ఒక వెబ్ సిరీస్ ను కూడా ఈమె చేసేందుకు రెడీ గా ఉందనే వార్తలు వస్తున్నాయి.ఇదే సమయంలో సోషల్ మీడియాలో వరుసగా కాస్త ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ఉంది.
ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ కు చాలా సీరియస్ గా స్పందిస్తున్న సమంత తాజాగా మరో సారి ఒక నెటిజన్ చేసిన కామెంట్స్ కు తీవ్రంగా స్పందించింది.సమంత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొన్నాళ్లు గా సమంత ను చాలా మంది చైతన్య ను మోసం చేశారు అంటూ విమర్శిస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.మీకు ఎలా మనసు వచ్చింది.మీలాంటి వారు ఒక మంచి వ్యక్తి ని ఎలా మోసం చేస్తారంటూ కొందరు సాప్ట్ గా విమర్శిస్తే మరి కొందరు మాత్రం హార్ష్ గానే రియాక్ట్ అవుతున్నారు.తాజాగా సమంత కూడా ఆ కామెంట్స్ కు స్పందించింది.
గతంలో మాదిరిగా సైలెంట్ గా ఉండకుండా.చూసి చూడనట్లు గా వదిలేయకుండా స్పందించింది.
సోషల్ మీడియాలో ఎక్కడైనా తనకు వ్యతిరేకంగా కామెంట్స్ వస్తే వెంటనే రియాక్ట్ అవుతూ ఉంది.తాజాగా సోషల్ మీడియాలో ఆమె స్పీడ్ చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు.
వరుసగా హాట్ ఫోటోలు షేర్ చేయడంతో పాటు వరుసగా ఇలా కౌంటర్ లు ఇవ్వడం దేనికి సంకేతం.ఉన్నట్లుండి సామ్ ఇంతగా ఎలా మారింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.







