టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 1100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్, చరణ్ లను పాన్ ఇండియా స్టార్ లుగా మార్చేసింది.ఎన్టీఆర్ ఈ సినిమా భారీ విజయం తర్వాత కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.పలు కారణాల వల్ల ఈ సినిమా సెట్స్ మీదకు ఇంకా వెళ్ళలేదు.
కానీ బ్యాకప్ లో మాత్రం స్పీడ్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.ఎన్టీఆర్ ఈ సినిమా కోసం 9 కేజీల బరువు తగ్గుతున్నాడు.
దీని కోసం ఇప్పటికే కసరత్తులు కూడా స్టార్ట్ చేసాడు.ఆగష్టులో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇక ఎన్టీఆర్ తర్వాత సినిమా కూడా ఫిక్స్ అయ్యింది.అది కూడా ఎన్టీఆర్ పుట్టిన రోజునాడు అఫిషియల్ గా ప్రకటించారు.
కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ తన 31వ సినిమా చేయనున్నాడు.ప్రకటించమే కాకుండా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా నీల్ ఎప్పటి లాగానే ఈ బ్లాక్ థీమ్ తో రివీల్ చేసాడు.
ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఎన్టీఆర్ గుబురు గడ్డంతో మెలితిప్పిన మీసంతో ఆకట్టు కున్నాడు.
దీంతో కొరటాల సినిమా కంటే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.
ఇది పక్కన పెడితే నీల్ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా హీరోయిన్ కోసం వేట జరుగుతుంది.ఎవరిని ఫైనల్ చేయాలా అని నీల్ టీమ్ మొత్తం పలు రకాలుగా చర్చించు కుంటున్నారు.
అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే నటిస్తుందని వార్తలు వచ్చాయి.కానీ ఇప్పుడు ఈమె కాదు జాన్వీ కపూర్ నటించనుంది అంటూ మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
దీంతో ఏది నిజం ఏది అబద్ధమో అని తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా రెగ్యురల్ షూట్ నవంబర్ రెండవ వారం నుండి స్టార్ట్ కాబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి.
మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాల్సిందే.







