బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కామెంట్స్.నోవాటెల్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్, స్టీరింగ్ కమిటీ సభ్యులు.
ప్రధాని మోదీ సభకు పది లక్షల మందిని తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నామంటోన్న బీజేపీ అధ్యక్షుడు.జూలై 3న సాయంత్రం 4గంలకు హైదరాబాద్ లో మోదీ భారీబహిరంగ సభ.ఈటల అమిత్ షాను కలవటంలో తప్పేంటి? ఈటల, అమిత్ షా భేటీపై అపార్థాలు తీయొద్దు.జాతీయ నేతలను కలిసే స్వేచ్ఛ మా పార్టీలో అందరకీ ఉంటోంది.
కేసీఆర్ పార్టీ మాదిరి కాదు.బీజేపీలో ఎవర్ని ఎవరైనా కలవొచ్చు.
జూలై 2,3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోదీ, అమిత్ షా, నడ్డా, కేంద్ర క్యాబినెట్, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు హాజరవుతారు.సమావేశాలకు మెత్తం 350మంది ప్రతినిధులు వస్తున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహచే అవకాశం రావటం అదృష్టంగా భావిస్తున్నాం.సమావేశాల నిర్వహణ కోసం 50వేల మంది నుంచి నిధిని సేకరిస్తున్నాం.ఆన్ లైన్ ద్వారా మాత్రమే నిధిని ఇవ్వాల్సి ఉంటోంది.టీఆర్ఎస్ అవినీతి, కుటుంబ పాలనను గద్దె దించటమే బీజేపీ లక్ష్యం.
రాష్ట్రంలో అన్ని దాందాలన్నీ టీఆర్ఎస్ నాయకులే చేస్తున్నారు.తెలంగాణ ప్రజలకు విశ్వాసం కల్పించే ఉద్దేశంతోనే హైదరాబాద్ లో జాతీయ కార్యవర్గ సమావేశాలు.18రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు, మాజీ ముఖ్యమంత్రులు రానున్నాను.జాతీయ కార్యవర్గ సమవేశాల కోసం 35కమిటీలను నియమించాం.







