పవన్ కు మనసు బాలేకపోతే ఆ సినిమా చూస్తారట.. ఏం జరిగిందంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు రెండు తెలుగు రాష్ట్రాలలో కోట్ల సంఖ్యలో అభిమానులు ఉన్నారనే సంగతి తెలిసిందే.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ మరో పార్టీతో పొత్తు లేకుండా పోటీ చేస్తుందని జనసేనకు కచ్చితంగా 30 నుంచి 40 సీట్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.పవన్ ప్రస్తుతం మూడు సినిమాలలో నటిస్తుండగా ఈ సినిమాలను పూర్తి చేసి రాజకీయాలతో బిజీ కావాలని ఆయన భావిస్తున్నారు.

 Star Hero Pawan Kalyan Favoruite Movie Details Here Goes Viral , Movies , Pawan-TeluguStop.com

హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, వినోదాయ సిత్తం రీమేక్ లను వీలైనంత వేగంగా పూర్తి చేసి రాజకీయాలలో సత్తా చాటాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు.

ప్రముఖ నటి, రాజకీయ నేత దివ్యవాణి ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పవన్ కళ్యాణ్ అంటే తనకు అభిమానమని పవన్ సున్నిత మనస్కుడు అని లీడర్ గా ఉన్నత స్థానాలకు ఎదగాలని పవన్ భావిస్తున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.

మనస్సు బాలేకపోతే పెళ్లి పుస్తకం సినిమాను చూస్తానని పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పారని దివ్యవాణి పేర్కొన్నారు.ఆలస్యమైనా పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధిస్తారని దివ్యవాణి చెప్పుకొచ్చారు.

టీడీపీకి దూరమైన దివ్యవాణి త్వరలో జనసేనలో చేరే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.గతంలో దివ్యవాణి వైసీపీపై ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Telugu Divyavani, Janasena, Pawan Kalyan, Pelli Pustakam, Vinodaya Sittam-Movie

వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం లేకపోవడం వల్లే దివ్యవాణి పవన్ కు అనుకూలంగా కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.మరోవైపు పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల తర్వాత సినిమాల్లో కొనసాగుతారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.పవన్ కళ్యాణ్ కెరీర్ విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఒకవైపు సినిమాలకు మరోవైపు రాజకీయాలకు సమానంగా ప్రాధాన్యత ఇస్తున్నారు.సినిమాసినిమాకు పవన్ కళ్యాణ్ కు క్రేజ్ పెరుగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube