ఆ స్టార్ హీరోయిన్ తో నాగచైతన్య ప్రేమలో ఉన్నారా.. ఏమైందంటే?

యంగ్ హీరో నాగచైతన్య సాధారణంగా మీడియాకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే.

వరుస సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉండగా చైతన్య నటించిన థాంక్యూ వచ్చే నెల 8వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

సమంతతో విడిపోయిన తర్వాత నాగచైతన్య వరుసగా సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అవుతూ కెరీర్ ను కొనసాగిస్తున్నారనే సంగతి తెలిసిందే.అయితే నాగచైతన్య ప్రస్తుతం ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన శోభితా ధూళిపాళ్లతో చైతన్య ప్రేమలో ఉన్నారని వైరల్ అవుతున్న వార్తల సమాచారం.గూఢఛారి, మేజర్ సినిమాలలో నటించడం ద్వారా శోభిత ఫేమస్ అయ్యారు.

వీళ్లిద్దరూ ఈ మధ్య కాలంలో కలిసి కనిపిస్తున్నారని సమాచారం.చైతన్య శోభిత మధ్య ఏదో ఉందని ప్రముఖ వార్తా పత్రికల్లో కథనాలు ప్రచారాంలోకి వస్తున్నాయి.

Advertisement

ఒకే ఇంట్లో వీళ్లిద్దరూ కలిసి ఉన్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.నాగచైతన్య లేదా శోభితలలో ఎవరో ఒకరు స్పందిస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

నాగచైతన్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

నాగ చైతన్యకు సినిమాసినిమాకు క్రేజ్ పెరుగుతోంది.

చైతన్య రెండో పెళ్లి చేసుకొని మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సమంత విడాకుల తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.నాగచైతన్య రెండో పెళ్లి చేసుకుంటే సమంత మరో పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

పుష్ప సినిమాతో నాకు వచ్చిందేమీ లేదు.. ఫహద్ ఫాజిల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
కెనడాలో మరోసారి ఖలిస్తాన్ మద్ధతుదారుల ర్యాలీ.. భారత అధినాయకత్వమే లక్ష్యమా..?

నాగ చైతన్య నటించిన సినిమాలు వరుసగా ఈ ఏడాది రిలీజ్ కానున్నాయి.

Advertisement

తాజా వార్తలు