బుల్లితెర మీద ప్రసారమౌతున్న రియాలిటీ షోలలో జబర్దస్త్ కామెడీ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టీవీలో ప్రసారమవుతున్న రియాలిటీ షోలతో పోలిస్తే జబర్దస్త్ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పటంలో సందేహం లేదు.
ఈ పాపులర్ రియాలిటీ షో గురించి ఇటీవల ప్రముఖ దర్శకుడు గీతాకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జబర్దస్త్ షో గురించి మాట్లాడుతూ.
ఇది ఒక బూతు షో.ఇలాంటి షోలు ఈటీవీలో రాకూడదని రామోజీ రావు గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.ఒకానొక సమయంలో ఈటీవి రేటింగ్స్ దారుణంగా పడిపోయి నెంబర్ 10 కి చేరుకుంది.కానీ ప్రస్తుత కాలంలో ఉన్న కాంపిటీషన్ కూడా ఎక్కువగా ఉంది.
అందువల్ల ఛానల్ రేటింగ్స్ పెంచుకోవటం కోసం మొదట ఈటీవీలో ఢీ అనే డాన్స్ షో స్టార్ట్ చేశారు.ఈ క్రమంలో జబర్దస్త్ షో ని కూడా ఒక కామెడీ షో గా ప్రేక్షకులను అలరించడానికి ప్రారంభించారు.
కానీ ప్రస్తుతం ఇది ఒక బూతు షో గా మారిపోయింది.కానీ ఈ షో ప్రారంభించిన తర్వాత ఈటీవీ నెంబర్ 2 స్థానంలోకి చేరింది.
అందువల్ల రామోజీ రావు గారు కూడా ఏమీ చేయలేకపోయాడు.జబర్దస్త్ షో లో వారు చెప్పే బూతు మాటలకి ఈ షోలో జడ్జీలుగా వ్యవహరిస్తున్న వారు కూడా వెకిలి నవ్వులు నవ్వుతున్నారు అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు.
ఈటీవీలో జబర్దస్త్ షో ప్రసారం చేయటం రామోజీ రావు గారికి అస్సలు ఇష్టం లేదు.కానీ ఈ షో వల్లనే ఈటీవీ ఇప్పుడీ స్థానంలో ఉందని ఆయన చెప్పుకొచ్చారు.

అయినా ఈ మధ్యకాలంలో ఇలాంటివే ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.అందువల్లే జబర్దస్త్ షో ఇంత పాపులర్ అయ్యింది అంటూ ఆయన చెప్పుకొచ్చారు.జబర్దస్త్ జడ్జ్ గా వ్యవహరించిన రోజా గారి గురించి కూడా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.ప్రముఖ నటి రోజా గారు ఈ షోలో జడ్జిగా వ్యవహరించారు.
ఈ షో కోసం రోజుకు ఆమెకు 50 వేల రూపాయలు ఇచ్చేవారు.ఇంత మొత్తంలో డబ్బు వస్తే ఎవరైనా చేస్తారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం రోజా గారికి మంత్రి పదవి దక్కడంతో షో నుండి వెళ్ళిపోయింది.రాజకీయాల గురించి రోజా గారు చాలా బాగా మాట్లాడుతారు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.







