విక్రమ్ విజయం.. కమల్ హాసన్ గట్టిగా హత్తుకుని భావోద్వేగం!

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఆయన నటించిన సినిమాలు ఎన్నో బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.

 Vikram Movie Success Kamal Haasan Get Very Emotionl , Kamal Hassan, Suhasini,tol-TeluguStop.com

వైవిధ్యమైన పాత్రలో నటిస్తూ విలక్షణ నటుడిగా కూడా కమల్ హాసన్ మంచి గుర్తింపు పొందాడు.అయితే చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న కమల్ హాసన్ సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి ఆ పనులలో బిజీగా ఉన్నాడు.చాలా కాలం తర్వాత కమల్ హాసన్ “విక్రమ్” సినిమా ద్వారా ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు.2 వారాల క్రితం విడుదలైన ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషలలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా హిట్ అవటంతో కమల్ హాసన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ప్రస్తుతం కమల్ హ్యాసన్ “విక్రమ్” సినిమా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

తన సొంత బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు.ఈ సినిమాలో సూర్య, ఫహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి వంటి వారు కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రలలో నటించారు.

ఈ సినిమాలో స్పెషల్ గెస్ట్ రోల్ చేసిన సూర్యకి కమల్ హాసన్ రోలెక్స్ వాచ్ బహుమతిగా ఇచ్చాడు.ఇక ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చాడు.

ఈ సినిమా చూసి పలువురు సినీ ప్రముఖులు కూడా ప్రశంసలు కురిపించారు.

ఇటీవల ప్రముఖ నటి సుహాసిని ఈ సినిమా గురించి స్పందించింది.ఇన్ స్టా గ్రామ్ వేదికగా సుహాసిని తన చిననాన్నకి శుభాకాంక్షలు తెలియజేసింది.సంతోషాన్ని తెలిపేందుకు పదాలు గానీ భాష గానీ అవసరం లేదు.

నేను ఎప్పుడూ ఆయనకు హలో చెప్పను.ఆయనకి నా ప్రేమని మాత్రమే చూపిస్తాను.

నిన్ను చూస్తుంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది చిట్టప్ప.ప్రపంచ వ్యాప్తంగా ఈ విజయం మార్మోగిపోతోంది అంటూ సుహాసిని చెప్పుకొచ్చింది.

ఇక కమల్ హాసన్‌ను ఎంతో గట్టిగా తాను హత్తుకుంది.ఈ ఫోటోని ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

సుహాసిని షేర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube