ఏపీ రాజకీయాలు రోజురోజుకీ వెడెక్కుతున్నాయి.పొత్తులు లేకుంటే ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ గట్టిగానే ఉండనుంది.
గత రెండు ఎలక్షన్లలో టీడీపీ, వైసీపీ అన్నట్లుగానే ఉన్న పోటీ ఇప్పుడు జనసేన బలపడుతున్న నేపథ్యంలో త్రిముఖ పోటీ ఏర్పడనుంది.అయితే వ్యతిరేక ఓట్లు ఏ పార్టీకి ప్లస్ అవుతాయోనన్నది ప్రస్తుతం చర్చకు దారీతీస్తోంది.
అయితే గతంలో చూసుకున్నట్లయితే ఉమ్మడి ఆంధ్రపదేశ్ లో కూడా టీడీపీ లేదా కాంగ్రెస్ అన్నట్లు ఉంటుండే.ఇక విభజన తర్వాత కూడా ఏపీలో కాంగ్రెస్ ప్లేస్ లోకి వైసీపీ వచ్చి చేరింది.
దీంతో 2014 ఎన్నికలు, 2019 ఎలక్షన్స్ కూడా టీడీపీ, వైసీపీ అన్నట్లుగానే సాగాయి.అయితే ఇప్పుడు జనసేన పుంజుకుంటున్న నేపథ్యంలో మరో పార్టీకి ఏపీలో ప్లస్ పాయింట్ అవుతుంది.
2014 ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోయినప్పటికీ టీడీపీతో జతకట్టి ఆ పార్టీకి సపోర్ట్ అందించింది.ఇక ఆ తర్వాత బాబుతో పొసగక విడిపోవడంతో 2019లో ఎలక్షన్లలో పోటీ చేసింది.
ఈ ఎలక్షన్లలో టీడీపీ దారుణంగా విఫలం అయింది.వైసీపీ గాలికి జనసేన ఒకే సీటుతో సరిపెట్టుకున్నా చివరకి పార్టీ మారడంతో ఖాళీ అయింది.
ఏకంగా జనసేన అధినేత కూడా ఓటమి చవిచూశాడు.అయినప్పటికీ కొన్ని చోట్ల గట్టిగానే పోటీ ఇచ్చింది.
దంతో జనసైనికులు నిరాశ పడలేదు.ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.
తాజాగా పవన్ ప్రకాశం జిల్లా టూర్ లో చాలా క్లారిటీగా మాట్లాడారు.ప్రజలకోసమే జనసేన పుట్టుకొచ్చిందని గట్టిగానే చెప్పారు.
ఓడినా గెలిచినా ప్రజల్లోనే ఉంటానని ఒక్క చాన్స్ ఇవ్వాలని అన్నాడు.ఇదంతా చూస్తుంటే వైసీపీకి, టీడీపీకి గట్టిగా పోటీ ఇచ్చేలా ఉంది.
ఇక టీడీపీ నేతలు కూడా నిత్యం జనాల్లో ఉంటూ ఎన్నికల హడావుడి స్టార్ట్ చేశారు.బాబు పర్యటన్లలో బిజీగా ఉన్నాడు.
భారీగా ఏపీలో యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు.లోకేశ్ బాబు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ నేత అచ్చెన్నాయుడని కూడా రంగంలోకి దింపుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ టీడీపీలకు దీటుగా ఏపీలో జనసేన పుంజుకుంటే ఏపీ మరో కర్నాటకగా అవుతుందని ఏ పార్టీకి మెజార్టీ రకపోగా హంగ్ ఏర్పడే పరిస్థితి ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే ఏపీలో త్రిముఖ పోటీతో విపక్షాల ఓట్లు చీలితే కేవలం వైసీపీ లభపడుతుంది అనడానికి లేదు.ఎందుకంటే ఏపీలో సంస్థాగతంగా టీడీపీ బలంగా ఉంది.చంద్రబాబు సభలకు జనాలు వస్తున్నారు.
టీడీపీకి ఉన్న నలభై శాతం ఓట్ల షేర్ పెరుగుతుంది.ఇక జనసేనకు 2019లో వచ్చిన ఆరు శాతం వచ్చే ఎన్నికలకు అది ముప్పై నుంచి నలబై శాతం పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఈ పెరిగిన ఓటు శాతం ఎక్కడి నుంచి వస్తుందనేది చర్చ జనసేన టీడీపీ ఓట్లను చీలుస్తుందనుకుంటే కష్టమే.టీడీపీ మరింత బలపడుతున్న నేపథ్యంలో.
అధికార పార్టీకి వ్యతిరేకత కూడా ఉండటంతో అప్పుడు కచ్చితంగా వైసీపీ ఓట్లే చీలుతాయంటున్నారు.పైగా గత ఎలక్షన్లలో వైసీపీకి ఉన్న మద్దతు ఇప్పుడు కలిసివచ్చేలా కనిపించడం లేదు.
మొత్తానికి మూడు పార్టీలు బలంగానే పోటీపడినా చివరకి ఏదైనా జరిగేలా కనబడుతోంది.