కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం ప్రస్తుతం దేశంలో పలుచోట్ల తీవ్ర స్థాయిలో వివాదానికి కారణమైంది.ఈ పథకం కింద ఆర్మీలో చేరాలనుకునే అభ్యర్థులను ఆహ్వానిస్తూ వారికి నాలుగు సంవత్సరాలపాటు ఆర్మీలో పని చేసే అవకాశాన్ని కల్పించింది.
అనంతరం వీరి నైపుణ్యాన్ని దృష్టిలో ఉంచుకొని 25 శాతం మందిని రెగ్యులర్ గా ఆర్మీలో కొనసాగిస్తారని వెల్లడించారు.ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేయగా మరి కొన్నిచోట్ల తీవ్ర స్థాయిలో వివాదాలు చెలరేగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పెద్దఎత్తున దాడులు చేస్తూ ఆస్తి నష్టం కలిగించారు.ఇకపోతే ఈ వివాదంపై కంగనా రనౌత్ స్పందిస్తూ ఈ పథకాన్ని గురుకులాలతో పోల్చి కామెంట్ చేశారు.
తాజాగా బిగ్ బాస్ విన్నర్ కౌశల్ స్పందించారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ సికింద్రాబాద్ ఘటన పట్ల నిరసన వ్యక్తం చేసిన వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో కొన్ని కోట్ల రూపాయల ఆస్తి నష్టం చేశారు.
ఈ విధంగా నష్టం కలిగించిన ఆస్తి మొత్తం ప్రజలదే, ఆ నష్టం మొత్తం తిరిగి మనమే టాక్స్ ల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.విషయం ఏదైనా కూడా ఇలాంటి ఉన్మాదం, ఉక్రోషం ఏమాత్రం పనికి రాదు అంటూ నిరసనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.శాంతియుత పోరాటం కూడా ప్రభుత్వాన్ని కదిలిస్తుంది అంటూ కౌశల్ సోషల్ మీడియా వేదికగా ఈ వివాదంపై స్పందించారు.
ఈ క్రమంలోనే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.