అక్కినేని అఖిల్, సురేందర్ రెడ్డి, అనిల్ సుంకర 'ఏజెంట్' నుండి సాక్షి వైద్య బర్త్ డే స్పెషల్ లుక్ విడుదల

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ హీరోగా స్టయిలీష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏజెంట్.స్టయిలీష్ స్పై థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘ఏజెంట్’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

 Heroine Sakshi Vaidya First Look From Akhil Agent Movie Details, Heroine Sakshi-TeluguStop.com

హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్ లో అడుగుపెడుతుంది.సాక్షి వైద్య పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. బర్త్ డే స్పెషల్ పోస్టర్ లో. లవ్లీ స్మైల్ తో క్రాప్డ్ స్వెట్ షర్ట్, జీన్స్ లో చాలా అందంగా, స్టయిలీష్ గా కనిపించింది సాక్షి వైద్య.కూల్ అండ్ ప్లజంట్ గా కనిపించి అందరి ద్రుష్టిని ఆకర్షించింది.

ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.

ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు.నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.

అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఆగస్ట్ 12న విడుదలకు సిద్ధమౌతుంది.

తారాగణం:

అక్కినేని అఖిల్, సాక్షి వైద్య, మమ్ముట్టి.

సాంకేతిక విభాగం :

దర్శకత్వం: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్ తమిళ, డీవోపీ : రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, స్టంట్స్: విజయ్ మాస్టర్, స్టంట్ శివ, పీఆర్వో: వంశీ-శేఖర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube