ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా ) ప్రపంచంలో ఉన్న తెలుగు సంఘాలు అన్నిటికంటే కూడా అతి పెద్ద తెలుగు సంఘంగా పేరొందింది.అమెరికాలో ఉండే తెలుగు వారి సంక్షేమం కోసం అలాగే తెలుగు సంస్కృతీ సాంప్రదాయాలు, తెలుగు బాషాబివృద్ది కోసం ఏర్పాటు చేయబడిన ఏకైక సంస్థ తానా.
అమెరికాలో ఉండే తెలుగు ఎన్నారైల పిల్లలకు తెలుగు నేర్పించడంతో పాటు తెలుగు పండుగలను అందరితో కలిసి ఎంతో కోలాహలంగా ఏర్పాటు చేయడంతో పాటు, ఎనో సేవా కార్యక్రమాలను కూడా చేపడుతోంది.ఆరోగ్య సంభందిత సలహాల కోసం నిపుణులతో చర్చా వేదికలు, ఉచిత వైద్య పరీక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేస్తోంది.
తాజాగా అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలో బౌలింగ్ బ్రూక్ ఐ ఎల్ లో ఉచిత కంటి వైద్య పరీక్షా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.స్థానికంగా ఉన్న ఇల్లినాయిస్ రాష్ట్ర తానా సభ్యులు ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసారు.
శనివారం నాడు జరిగిన ఈ కార్యక్రమానికి స్థానికంగా ఉన్న తెలుగు ప్రవాస కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.తానా సభ్యులు అలాగే స్థానిక అమెరికన్స్ కూడా ఈ ఉచిత వైద్య శిబిరాని తరలివచ్చారు.
అమెరికాలో ప్రముఖ కంటి వైద్య నిపుణులుగా పేరొందిన
డాక్టర్ శ్రీరాం సౌలీ కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి సూచనలు, సలహాలు అందించారు.స్థానిక తానా మహిళా కో ఆర్డినేటర్ డా.ఉమ ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పరిశీలించారు.ఈ ఉచిత వైద్య కేంద్రానికి బోలింగ్ బ్రూక్ మేయర్ మ్యారీ మోస్టా హాజరయ్యి తానా సభ్యుల కార్యక్రమాలను గూర్చి తెలుసుకుని అభినందించారు.
తానా ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరానికి విశేష స్పందన రావడంతో పాటు స్థానిక అమెరికన్స్ కూడా కృతజ్ఞతలు తెలిపారు.తానా ఏర్పాటు చేసిన కంటి వైద్య శిబిరం ఎంతో ఉపయోగపడిందని తానా సభ్యులుగా ఉన్నందుకు గర్వంగా ఉందంటూ స్థానిక తానా తెలుగు ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేసారు.







