అయ్యన్న ఇంటి వెనుక గోడను జేసీబీతో తొలగించేందుకు యత్నం

మాజీ మంత్రి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని.ఆదివారం తెల్లవారుజామున పోలీసు బలగాలు చుట్టుముట్టాయి.

 Attempt To Remove The Back Wall Of The Ayyanna S House With Jcb , Jcb, Ayyannap-TeluguStop.com

విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ఆయన ఇంటి గోడను జేసీబీలతో కూల్చేందుకు యత్నించారు.పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది తెలిపారు.

జేసీబీతో ఇంటి వెనక గోడను తొలగిస్తున్న దృశ్యం ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారని నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ నోటీసులో పేర్కొన్నారు.ఈ నెల రెండో తారీఖుతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇచ్చి వెంటనే గోడ తొలగించడంపై అయ్యన్న కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపారు.

మళ్లీ కొనసాగుతున్న గోడ తొలగింపు పనులు.అయ్యన్న కుటుంబ సభ్యులు కాసేపు అడ్డుకోవడంతో ఆగిన గోడ కూల్చివేత పనులను.

మున్సిపల్ సిబ్బంది మళ్లీ ప్రారంభించారు.అయ్యన్న పాత్రుడు ఇంటికి దారి తీసే రెండు మార్గాలను పోలీసులు ఇప్పటికే మూసివేశారు.

నర్సీపట్నం ఏఎస్పీ పర్యవేక్షణలోనే పోలీసు బలగాలు మోహరింపు చేయగా.మీడియాను కూడా పరిసరాల్లోకి రానీయకుండా చర్యలు చేపట్టారు.అయ్యన్నపాత్రుడి ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతోపాటు భారీగా పోలీసులను మోహరించారు.అయ్యన్నపాత్రుడు ఇంటి పరిసరాల్లో భారీగా పోలీసుల మొహరింపు ఇటీవల అనకాపల్లి జిల్లా చోడవరం మినీ మహానాడు సభలో.

అయ్యన్న చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకొని ఆయన్ను అరెస్టు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube