విరాటపర్వం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నటి సాయి పల్లవి కాశ్మీర్ పండిట్ల హత్య, గోహత్యల గురించి సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి.ఈ విధంగా ఈమె మతాల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో చాలా మంది ఈమె పై విమర్శలు చేయడమే కాకుండా ఏకంగా పోలీస్ స్టేషన్ లో తనపై ఫిర్యాదు చేశారు.
సాయి పల్లవి చేసిన వ్యాఖ్యలకు తాను బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ విధంగా సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు నడుమ విరాట పర్వం సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది.
ఈ క్రమంలోనే శనివారం రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ఏర్పాటుచేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా సాయిపల్లవి తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు.తను చేసిన వ్యాఖ్యలను చాలా తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు.తనకు డాక్టర్ గా అన్ని ప్రాణులు సమానమేనని హింస అనేది ఏ మతంలోనైనా మంచిది కాదన్న ఉద్దేశంతోనే తను అలా మాట్లాడానని తెలిపారు.

ఎవరిని కించ పరచాలని ఉద్దేశ్యంతో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన దృష్టిలో హింస అనేది ముమ్మాటికీ తప్పే అంటూ ఈ సందర్భంగా ఈమె తెలిపారు.ఒక డాక్టర్ గా ప్రాణం విలువ నాకు తెలుసు.ఒకరి ప్రాణం తీసే హక్కు మరొకరికి లేదని ఈ సందర్భంగా ఈమె స్పష్టం చేశారు.మూస దాడులను సమర్ధించే వారు చాలామంది ఉన్నారని అలాంటి వారిని చూస్తే ఆశ్చర్యమేస్తుందని తెలిపారు.
తాను చెప్పిన ఇంటర్వ్యూ మొత్తం చూడకుండా ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.







