మన ఆంధ్రాలోనే అద్భుతమైన ఉద్యానవనం.. ఈ ప్రకృతి ప్రపంచంలోకి వెళ్లాలంటే ఇది చదవాల్సిందే!

అవును, మన ఆంధ్రాలోనే అద్భుతమైన ఉద్యానవనం వుంది.అక్కడ ఒక్కో మొక్క ఒక్కో అద్భుతం అని చెప్పుకోవాలి.

 Vishakapatnam Vuda Bio Diversity Park With Hundreds Of Plant Species Details, An-TeluguStop.com

ప్రకృతి ప్రపంచంలోకి వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో ఉన్న పెద్ద వాల్తేర్‌కు వెళ్లాల్సిందే.అక్కడే బయోడైవర్సిటీ పార్క్ కలదు.

VUDA (విశాఖపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) మరియు డాల్ఫిన్‌ నేచర్‌ కన్జర్వేటివ్‌ సొసైటీ వాలంటీర్స్‌ సహాయంతో నిర్వహించబడుతున్నది ఈ విద్యా వృక్ష ఉద్యానవనం.ఇందులో 2000 కంటే ఎక్కువ జాతుల మొక్కలు, వందలాది సీతాకోకచిలుక మరియు పక్షి జాతులు కలవు.

ఉద్యాన వనం గురించి విశాఖ నగరంలో చాలా తక్కువ మందికి తెలుసు.చెట్ల పెంపకం మరియు వన్యప్రాణుల సంరక్షణ, వృక్షజాలంపై పరిశోధన మరియు అవగాహన కార్యకలాపాలు వంటి వాటిమీద విద్యార్థులకు ఇక్కడ తరచూ అవగాహన కల్పిస్తారు.

అలాగే విశాఖపట్నం జిల్లాలో సీతాకోకచిలుకలు మరియు పక్షులపై పరిశోధన సర్వేలు చేపట్టడం లాంటి ఎన్నో పరిరక్షణ కార్యక్రమాలు చేపడుతున్నారు.

VUDA, DCNS ఆధ్వర్యంలో పెదవాల్టైర్ లోని రాణి చంద్రమని దేవి ఆస్పత్రి పరిసరాలను 5 జూన్, 2002న దత్తత తీసుకోవడం జరిగింది.

Telugu Andhra, Hundreds, Pedda Valtheru, Rcdbio, Latest, Vishakapatnam, Vizag, V

ఆ తరువాత ఆ ప్రాంతాన్ని అందంగా, ఆహ్లాదకరమైన బయో డైవర్సిటీ పార్కు గా తీర్చిదిద్దారు.ఈ పార్క్ సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి వుంది.ఇప్పుడు ఈ RCD బయో-డైవర్సిటీ పార్క్ 70 జాతుల పక్షులు మరియు 100 జాతుల సీతాకోకచిలుకలతో, అలాగే 2000 కంటే ఎక్కువ జాతుల మొక్కలతో అద్భుతమైన ఉద్యానవనంగా విరాజిల్లుతోంది.2002లో GVK కాలేజీ జువాలజీ ఫ్రొపెసర్‌.తమ విద్యార్థులతో కలిసి ఇక్కడ 100 రకాల మొక్కలను నాటడం జరిగింది.ఇప్పుడు వాటి సంఖ్య 2000 దాటింది.అందులో 500 వరకు విలువైన మెడిసినల్‌ ప్లాంట్స్ కలవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube