దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో స్థాయిలో మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చే స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
చరిత్రలో ఎప్పుడూ కలవని ఇద్దరు యోధులు కలిస్తే ఎలా ఉంటుందో రాజమౌళి ఈ చిత్రం ద్వారా చూపించారు.ఇలా ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటించగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు.
ఈ సినిమాకు కేవలం దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తరాది రాష్ట్రాలలో కూడా ప్రేక్షకులు పెద్దఎత్తున బ్రహ్మరథం పట్టారు.ఇక దేశ విదేశాలలో కూడా ఏ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టించింది.
ఇకపోతే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఎన్టీఆర్ పై ఓ స్పెషల్ ఎడిషన్‌కు ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.అయితే ఈ స్పెషల్ ఎడిషన్ సంబంధించిన న్యూస్ పేపర్ లో రావడం గమనార్హం.
ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇలా కొమురంభీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ కి సంబంధించిన స్పెషల్ ఎడిషన్ కి సంబంధించిన న్యూస్ పేపర్లో రావడంతో ఎన్టీఆర్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి క్రియేటివిటీకి తారక్ నటనకు అభిమానులు ఫిదా అవుతున్నారు.ఇలా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకోవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.








