ఎలుక సాయంతో పోలీసులు 100 గ్రా. బంగారం పట్టుకున్నారు.. ఎలాగంటే?

ఇలాంటప్పుడే అదృష్టం అనే విషయాన్ని నమ్మవలసి ఉంటుంది.పోగొట్టుకున్న లక్షలు విలువైన బంగారు ఆభరణాలు ఓ ఎలుక సాయంతో పోలీసులు పట్టుకున్నారంటే నమ్మబుద్ధి కావడంలేదు కదూ.

 Police Recovered 100grams Gold With The Help Of Rat In Mumbai Details,  Rat, 100-TeluguStop.com

కానీ మీరు విన్నది నిజమే.ఓ ఎలుక చెత్తకుప్పలోని 100 గ్రాముల బంగారాన్ని పట్టించింది.

ఈ ఘటన మహారాష్ట్ర, ముంబయిలోని దిండోశీ అనే ప్రాంతంలో జరగగా తాజాగా వెలుగు చూసింది.చెత్తకుప్పలో బంగారం దొరకడమేమిటి? అనే అనుమానం వస్తుంది కదూ.అయితే వెంటనే ఈ స్టోరీ చదవండి.

ఈ సంఘటన ముంబయిలోని దిండోశీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

అక్కడ ఆరే కాలనీకి చెందిన సుందరి అనే మహిళ, తన కుమార్తె వివాహం కోసం రుణం పొందేందుకు తన దగ్గర వున్న 100 గ్రాముల బంగారు ఆభరణాలతో బ్యాంకుకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ఓ యాచకురాలు వారిని యాచించగా ఓ కవర్​లో ఉన్న వడాపావ్​ను ఆమెకి ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

కట్ చేస్తే వారు బ్యాంకుకు వెళ్లి చూసుకోగా బంగారం కనిపించలేదు.దాంతో వారు దీర్ఘ ఆలోచనలో పడగా వడాపావ్​ ఇచ్చిన బ్యాగ్​లోనే బంగారం ఉన్నట్లు గమనించారు.హుటాహుటిన ఆ యాచకురాలు కనిపించిన ప్రాంతానికి వెళ్లారు.కానీ, అక్కడ ఆమె కనబడలేదు.

వేరేదారిలేక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు.

Telugu Grams, Beggar, Dindoshi, Gold, Rat, Mumbai, Recoveredgrams, Vadapav, Late

కేసు నమోదు చేసుకున్న దిండోశీ పోలీస్​ స్టేషన్​ ఇంఛార్జ్​ సూరజ్​ రౌత్​ తనిఖీలు చేపట్టారు.ఈ క్రమంలో సదరు పరిసర ప్రాంతాల్లోని CCTV కెమెరాలను పరిశీలించగా, ఆ యచకురాలు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు.తరువాత ఆమెను పట్టుకుని విచారించగా.

వడాపావ్​ కవర్​ను చెత్తకుప్పలో పడెసినట్లు తెలిపింది.దాంతో పోలీసులు చెత్తకుప్పలో వెతికినప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది.

ఆ తరువాత చెత్తకుప్ప సమీపంలోని CCTV కెమెరాలను క్షణ్నంగా పరిశీలించగా ఓ ఎలుక ఆ బ్యాగ్​ను పట్టుకుని ఉన్నట్లు గుర్తించారు.అలా దాన్ని వెంబడించి ఆఖరికి ఆ బంగారాన్ని పట్టుకున్నారు.

అనంతరం సుందరి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube