కేసీఆర్ దూకుడుకు కేంద్రం ఆ రూట్లో చెక్ పెడుతోందా..?

ప్ర‌స్తుతం తెలంగాణ సీఎం కేసీఆర్ త‌న నిర్ణ‌యాల‌తో రాజ‌కీయాల్లో సంచ‌ల‌న రేపుతున్న విష‌యం తెలిసిందే.రాష్ట్రంలో అధ్య‌క్ష ప‌ద‌వి బాధ్య‌తలు కీల‌క నేత‌కు అప్ప‌గించి తాను జాతీయ పార్టీ అధ్య‌క్ష హోదాలో కొన‌గానున్నారు.

 Is The Center Of Kcr Aggression Checking On That Route Cm Kcr, Telangana, Centr-TeluguStop.com

బీజేపీ, కాంగ్రెస్ యేత‌ర ప్ర‌భుత్వం కేంద్ర‌లో రావాల‌ని మొద‌టినుంచి ప‌ట్టుబ‌డుతున్న కేసీఆర్ కొత్త పార్టీ పెట్టి సంచ‌ల‌న సృష్టించారు.ద‌క్ష‌ణాదికి కేంద్రం అన్యాయం చేస్తోంద‌నే నినాదంతో కేంద్రంతో యుద్దం చేయ‌డానికి సిద్ద‌మ‌వ‌తున్న నేప‌థ్యంలో కేంద్రం కేసీఆర్ దూకుడుకి క‌ళ్లెం వేయ‌ల‌ని చూస్తోందా అంటే నిజ‌మ‌నే అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

రాష్ట్రం అప్పుల విష‌యంలో ఆర్థికంగా ఇరుకున పెట్టేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోందిని అంటున్నారు.

అయితే ఈ ఏడాది రాష్ట్రం తీసుకునే అప్పుల‌లో భారీగా కోత విధించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

కేంద్రం అభ్యంతరం చెబుతున్న బడ్జెటేతర రుణాలను నాలుగేళ్ల కాలానికి సర్దుబాటుచేసే అవకాశం కనిపిస్తోంది.అదే జరిగితే ప్రతిపాదిత రుణాల్లో యేటా రూ.14 వేల కోట్ల వరకు కోత‌పెట్టే ప‌రిస్థితి క‌న‌బ‌డుతోంది.అయితే ఇప్ప‌టికే కేంద్రం అభ్యంతరాలకు ఇప్పటికే సమాధానామిచ్చిన‌ రాష్ట్రం ప్ర‌భుత్వం ఎఫ్ఆర్బీఎం కి లోబడి తీసుకున్న రుణాలతో పాటు బడ్జెట్ వెలుపల వివిధకార్పోరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులకు సంబంధించిన సమగ్ర సమాచారం అందించింది.

ఇక‌ బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి లోబడి.బాండ్ల జారీద్వారా తీసుకునే అప్పుల మొత్తాన్ని ఇంకా తేల్చలేదు.

Telugu Budget, Central, Cm Kcr, Congress, Kcr, Modi, Telangana, Ts Poltics-Polit

అయితే రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కేంద్రం ఆ చెల్లింపులను బడ్జెట్ నుంచే చేస్తున్నందున వాటిని ఎఫ్ఆర్బీఎం కిందే పరిగణి స్తామని అంటోంది.ఆ తరహా రుణాలు గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో రూ.57వేల కోట్ల వరకు ఉన్నాయి.అయితే ఆ మొత్తాన్ని ఒకే ఏడాదికి కాకుండా నాలుగేళ్ల ఎఫ్ఆర్బీఎం రుణాల్లో సర్దుబాటు చేసేందుకు కేంద్ర ఆర్థికశాఖ అంగీకరించినట్లు సమాచారం.అందుకే ఈ రూ.57 వేల కోట్ల మొత్తాన్ని నాలుగు భాగాలుగా చేసి ఈ ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి వ‌రుస‌గా నాలుగేళ్ల‌పాటు ఎఫ్ఆర్బీఎం అప్పుల్లో భాగంగా ప‌రిగ‌ణించి బ‌డ్జెట్ ప్ర‌తిపాదించిన అప్పుల్లో ఏటా రూ.14 వేల కోట్లు కోత విధిస్తారు.ఇక ఈ ఆర్థిక సంవ‌త్స‌రం ప్ర‌తిపాదించిన రూ.53 వేల కోట్ల‌లో కోత విధించి మిగ‌తా మొత్తానికి అనుమ‌తిచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.రాష్ట్ర అప్పుల కోత విష‌యంలో సీఎం కేసీఆర్ ఎలా స్పందించ‌నున్నారో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube