వరుసగా 4 సినిమాలతో ఎన్టీఆర్ క్రియేట్ చేసిన రికార్డ్ ఏంటో తెలుసా?

ఈతరం హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయనే సంగతి తెలిసిందే.యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినీ కెరీర్ లో ఎన్నో అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకున్నారనే సంగతి తెలిసిందే.

 Young Tiger Junior Ntr Rare Record Details Here Goes Viral ,young Tiger Junior N-TeluguStop.com

ఈతరం హీరోలలో డబుల్ హ్యాట్రిక్ సాధించిన స్టార్ హీరోలలో తారక్ ఒకరు కావడం గమనార్హం.ఏ పాత్రలో నటించినా ఆ పాత్రతో విజయాలను అందుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడుగా ప్రశంసలను సొంతం చేసుకున్నారు.

అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో చాలామంది అభిమానులకు తెలియని మరో అరుదైన రికార్డ్ కూడా ఉంది.సింహాద్రి తర్వాత సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ కు యమదొంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది.

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో 32 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది.ఈ సినిమాకు ఉత్తమ కథానాయకుడిగా తారక్ కు ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.

ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెహర్ రమేష్ డైరెక్షన్ లో కంత్రి సినిమాలో నటించారు.కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు కూడా తారక్ కు ఉత్తమ కథానాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.ఆ తర్వాత తారక్ వి.వి.వినాయక్ డైరెక్షన్ లో అదుర్స్ సినిమాలో నటించారు.ఈ సినిమాకు కూడా తారక్ కు ఉత్తమ కథానాయకుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.

Telugu Filmfare Award, Rare, Tollywood, Yamadonga-Movie

తారక్ నటించిన బృందావనం సినిమా 2010 సంవత్సరంలో విడుదలై బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ను సొంతం చేసుకుంది.ఈ సినిమాకు కూడా తారక్ కు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ దక్కింది.ఈ విధంగా వరుసగా నాలుగు సినిమాలతో తారక్ ఫిల్మ్ ఫేర్ అవార్డులను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ అరుదైన రికార్డ్ తారక్ ఖాతాలో ఉండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube