ఉగ్రవాద ఆరోపణలు .. ఇండియాకు అప్పగింతపై విచారణ, యూకేలో భారత సంతతి వైద్యుడి విజయం

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఇండిపెండెంట్) లేదా ఉల్ఫా (ఐ)కి ఛైర్మన్‌గా వున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత సంతతికి చెందిన యూకే వైద్యుడు డాక్టర్ ముకుల్ హజారికా (75).ఈ కేసుకు సంబంధించి తనను భారత్‌కు అప్పగించొద్దంటూ యూకే న్యాయస్థానంలో చేస్తున్న పోరాటంలో ఆయన విజయం సాధించారు.
ఉత్తర ఇంగ్లాండ్‌లోని క్లీవ్‌ల్యాండ్‌లో స్థిరపడిన హజారికాను ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, యుద్ధం చేయడానికి ప్రయత్నించడం, యుద్ధానికి ప్రోత్సహించడం వంటి కారణాలపై విచారించేందుకు గాను తమకు అప్పగించాల్సిందిగా భారత దర్యాప్తు ఏజెన్సీలు యూకే ప్రభుత్వాన్ని కోరాయి.దీనిపై విచారణ నిర్వహించిన వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి మైఖేల్ స్నో బుధవారం తీర్పు వెలువరించారు.

 Indian-origin Doctor Mukul Hazarika Freed In Terror Charge Extradition Case In U-TeluguStop.com

ఈ కేసులోని వివరాలు సంతృప్తికరంగా లేనందున నిందితులను విడుదల చేయాల్సిందిగా ఆదేశించారు.డాక్టర్ హజారికా ఉల్ఫా (ఐ) ఛైర్మన్ అని నిర్థారించే ఆమోదయోగ్యమైన ఆధారాలు లేవని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.

Telugu Abhijit Asom, Assam, General, Mukul Hazarika, Charge, Ulfa, Ulfa Chairman

ఈ కేసుకు సంబంధించి మే నెలలో జరిగిన విచారణ సందర్భంగా భారత ప్రభుత్వం తరపున క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) . వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టులో జిల్లా జడ్జి మైఖేల్ స్నో ఎదుట హాజరైంది.ఉగ్రవాద శిబిరాలను నిర్వహించడం, ఉగ్రవాదానికి క్యాడర్‌ను రిక్రూట్‌ చేసుకోవడం వంటి అభియోగాలు డాక్టర్‌ ముకుల్‌పై వున్నాయని సీపీఎస్ తెలిపింది.భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడం, యుద్ధం చేసేలా పలువురిని ప్రోత్సహించడం వంటి ఆరోపణలు అతనిపై వున్నట్లు సీపీఎస్ న్యాయవాది బెన్ లాయిడ్ వాదనలు వినిపించారు.

Telugu Abhijit Asom, Assam, General, Mukul Hazarika, Charge, Ulfa, Ulfa Chairman

హజారికా తరపు న్యాయవాది బెన్ కూపర్ మాట్లాడుతూ.ప్రత్యేకమైన సాక్ష్యం లేనందున అతనిపై కేసు పెట్టడం కుదరదని వాదించారు.అతని ఉల్ఫా (ఐ) సంస్థ. ఉల్ఫా వలే నిషేధిత సంస్థ కాదని.స్వయం ప్రకటిత ఛైర్మన్‌గా దర్యాప్తు సంస్థలు ఆరోపించిన అతని పాత్ర కానీ, మయన్మార్‌ స్పీచ్‌కు సంబంధించిన కంటెంట్‌ కూడా అందుబాటులో లేదని కూపర్ వాదించారు.అంతేకాకుండా.

అస్సాం వాచ్ ఏర్పాటుతో సహా క్రియాశీల మానవ హక్కుల న్యాయవాదిగా హజారికా కార్యకలాపాలను కోర్టుకు అందించారు.భారత దర్యాప్తు అధికారులు హజారికాను లక్ష్యంగా చేసుకున్నారని బెన్ కూపర్ వాదించారు.

డాక్టర్‌గా ప్రాక్టీస్ చేస్తూనే.అస్సాం ప్రజల మానవ హక్కులను రక్షించడానికి ముకుల్ కట్టుబడి వున్నారని కూపర్ చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube