సాధారణంగా మహిళలకు 50 ఏళ్లకు పైగా వయసొస్తే వారు సాహసోపేత యాత్రలకు ఆమడ దూరం ఉంటారని అందరూ అనుకుంటారు.కానీ అది అబద్ధమని కొందరు వృద్ధ మహిళలు నిరూపిస్తున్నారు.
ప్రస్తుతం ప్రముఖ పర్వతరోహకురాలు బచేంద్రిపాల్ నేతృత్వంలో 12 మంది మహిళలు అత్యంత సాహసోపేతమైన యాత్ర చేస్తూ అందరినీ అబ్బుర పరుస్తున్నారు.వీరి యాత్ర ప్రస్తుతం హిమాలయాల్లో కొనసాగుతోంది.
సాధారణంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో ప్రతికూలమైన వాతావరణం నెలకొంటుంది.ఇలాంటి వాతావరణంలో యుక్త వయసులో ఉన్న వారే ప్రయాణాలు చేయలేరు.
అక్కడ చలి పులి చంపేస్తుంది అంటే నమ్మండి.అయినా అవేమీ లెక్క చేయకుండా ఈ భారతీయ మహిళలు సుదీర్ఘమైన యాత్ర చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ఈ టూరిస్ట్ బృందంలో 50 ఏళ్ల వయసుకు పైబడిన వారే ఉండటం ఇప్పుడు అందర్నీ మరింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.ఈ మహిళలు 2022, మార్చి 12న భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని పాంగ్ సౌ కనుమ మార్గం ద్వారా కాలినడక ప్రయాణాన్ని ప్రారంభించారు.
వారి యాత్ర లక్ష్యం ఏంటంటే… తూర్పున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయాల చివరి నుంచి పశ్చిమాన ఉన్న లద్దాఖ్‌లోని కార్గిల్‌కు కాలినడకన ప్రయాణించడమే.ఈ ప్రయాణం పూర్తి చేయాలంటే వారంతా 4,977 కి.మీ దూరాన్ని ట్రెకింగ్ చేయాల్సి ఉంది.అంటే దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించాలి.
మలి వయసులో యాత్ర చేయడం అనేది ఒక సాహసమే అని చెప్పాలి.

గడిచిన 90 రోజుల్లో ఈ మహిళలు అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఎగువ బంగాల్, సిక్కింలతో పాటు నేపాల్‌లో విస్తరించి ఉన్న హిమాలయ పర్వతాల మీదుగా ప్రయాణం చేశారు.మీరు డైలీ 25 కి.మీ దూరం ప్రయాణించగలుగుతున్నారు.ఈ దూరంలో వారు కొండలు, కోనలు, లోయలు, ఇలా రకరకాల భౌగోలిక పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు.ప్రస్తుతం వీరు ఎక్కడ ఉన్నారో తెలుసా… సముద్ర మట్టానికి ఏకంగా 17,769 అడుగుల ఎత్తున గుండె తొరంగ్లా పాస్‌లో ఉన్నారు.
ఇప్పుడే అక్కడికి చేరుకున్న ఈ బృందం త్వరలోనే మరింత ముందుకు సాగనుంది.ఈ విషయాన్ని తాజాగా వారి యాత్రకు చేయూతనందించిన టాటా స్టీల్ కంపెనీ అధికారులు వెల్లడించారు.
జులై నెలాఖరులోపు వీరు తమ యాత్రను పూర్తి చేస్తారని తెలుస్తోంది.







